Hyderabad: వి.వి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా వాసిరెడ్డి ఫౌండేషన్ జాతీయ పురస్కార ప్రధానోత్సవం

|

Oct 24, 2021 | 3:54 PM

తెలుగు సాహిత్య చరిత్రలో ప్రఖ్యాతిగాంచిన వాసిరెడ్డి ఫౌండేషన్ జాతీయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి తెరలేచింది.

Hyderabad: వి.వి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా వాసిరెడ్డి ఫౌండేషన్ జాతీయ పురస్కార ప్రధానోత్సవం
Raja Vasireddy Foundation
Follow us on

తెలుగు సాహిత్య చరిత్రలో ప్రఖ్యాతిగాంచిన వాసిరెడ్డి ఫౌండేషన్ జాతీయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి తెరలేచింది. 2019 నుంచి ఈ పురస్కారాలను వివిధ విభాగాల్లో ప్రసిద్ధిగాంచిన వారికి అందజేస్తున్నారు. ఈ ఏడాది సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించబోతున్న వేడుకలకు మాజీ ఐపీఎస్ అధికారి వి.వి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరవ్వబోతున్నారు. విశిష్ఠ అతిథిగా ఇన్ కమ్ టాక్స్ అడిషనల్ కమిషనర్ జవీన్ లాల్ నవిడియా విచ్చేయనున్నారు. ప్రముఖ గజల్ కవయిత్రి, భాషావేత్త రాజావాసిరెడ్డి మల్లీశ్వరి రాసిన మల్లియలు, నిరాతప, ‘ఒక్కపదం అర్ధాలెన్నో’.. పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నారు. సభాధ్యక్షులు సీనియర్ జర్నలిస్, సుప్రసిద్ధి కవి అయిన బిక్కి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో బాలసాహిత్యం విభాగంలో చిత్రలేఖ మామిడిశెట్టి రాసిన “ఓసి నా చిత్రాంగి-నా చిట్టితల్లి మనసుకథలు” పుస్తకానికి జాతీయ పురస్కారం లభించింది. తెలుగు, ఆంగ్ల సాహిత్యంలో రచనలు చేసే చిత్రలేఖ… ఇటీవలే మాన్ ఇన్ ద మౌంటెయిన్స్ అనే ఫిక్షనల్ నవల కూడా విడుదల చేశారు.