హీరో అనుకుంటున్నాడు.. పార్టీ పరువు దిగజారుస్తున్నాడు..!

గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ.. కాంగ్రెస్‌లో తాను ఒక్కడు తప్ప ఎవరు లేరని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు.

హీరో అనుకుంటున్నాడు.. పార్టీ పరువు దిగజారుస్తున్నాడు..!

Edited By:

Updated on: Mar 12, 2020 | 8:29 PM

గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ.. కాంగ్రెస్‌లో తాను ఒక్కడు తప్ప ఎవరు లేరని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. సొంత ఎజెండా కోసం పిచ్చి డ్రామాలు ఆడటం కాదని.. తనపై వచ్చిన ఆరోపణలు నిరూపించుకొని అప్పుడు ప్రజల కోసం పోరాటం చేయాలని ఆయన హితవు పలికారు. సీబీఐ, ఎన్ఫోర్స్‌మెంట్ మొదలు.. అనేక కేసుల్లో రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని.. వాటన్నంటికి కాంగ్రెస్ తనకు మద్దతు ఇవ్వడం లేదంటే ఎలా..? అని వీహెచ్ ప్రశ్నించారు. రేవంత్ వ్యవహారంపై కోర్ కమిటీ ఏర్పాటు చేయమని ఉత్తమ్ , బట్టి , కుంతీయలకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

రేవంత్ తనకు తానే హీరోలా ఫీల్ అవుతూ.. సొంత నిర్ణయాలు తీసుకొని పార్టీ పరువు దిగజరుస్తున్నారని వీహెచ్ దుయ్యారబట్టారు. ఇలాంటి వ్యహరాలు ప్రాంతీయ పార్టీలో నడుస్తాయి కానీ జాతీయ పార్టీలో నడవవని వీహెచ్ స్పష్టం చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదని ఆయన సూచించారు. కాంగ్రెస్‌కు కొన్ని విధానాలు ఉంటాయని.. పార్టీలో చర్చించిన తరువాతే ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.111 జీవో మీద పోరాటం చేసే ముందు రేవంత్ పార్టీలో ఎవరిని సంప్రదించలేదని వీహెచ్ ఫైర్ అయ్యారు. పార్టీలో నిర్ణయాలపై సీడబ్ల్యూసీ సమావేశం ఉంటుందని.. తరువాత నిర్ణయాలు ఉంటాయని వీహెచ్ తెలిపారు. రేవంత్ చర్యలను హై కమాండ్ గమనిస్తోందని వీహెచ్ చెప్పుకొచ్చారు.

Read This Story Also: రేవంత్.. నువ్వేం తీస్‌మార్ ఖాన్‌ కాదు..!