BJP Vijaya Sankalpa Sabha: ఇక్కడ అరాచక పాలన.. తెలంగాణలో ఎలాంటి వివక్ష లేని బీజేపీ పాలన రాబోతోంది..

|

Jul 03, 2022 | 8:42 PM

Union Minister Piyush Goyal: మోదీ మార్గదర్శకంలో తెలంగాణలోనూ బీజేపీ సర్కారు వస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని బీజేపీ కాంక్షిస్తోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు బాధతో..

BJP Vijaya Sankalpa Sabha: ఇక్కడ అరాచక పాలన.. తెలంగాణలో ఎలాంటి వివక్ష లేని బీజేపీ పాలన రాబోతోంది..
Union Minister Piyush Goyal
Follow us on

కేసీఆర్‌కు జవాబు ఇచ్చేందుకు భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలివచ్చాయన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. మోదీ మార్గదర్శకంలో తెలంగాణలోనూ బీజేపీ సర్కారు వస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని బీజేపీ కాంక్షిస్తోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు బాధతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత గ్రామగ్రామాన కనిపిస్తోందన్నారు. అవినీతి, కుటుంబపాలన, బుజ్జగింపులను ఇక తెలంగాణ భరించదని.. తెలంగాణ ప్రజలకు అవినీతిరహిత ప్రభుత్వం కావాలన్నారు గోయల్‌. బీజేపీ ప్రభుత్వం కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని.. జీహెచ్‌ఎంసీలో మాకు వచ్చిన 50 సీట్లు ట్రయలర్‌ మాత్రమే అని అన్నారు. తెలంగాణలోని అనేక ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతోందని కేంద్ర మంత్రి గోయల్ ఆరోపించారు.

తెలంగాణ ప్రజలు ఇక అవినీతిని సహించలేరని.. బుజ్జగింపు రాజకీయాలు తెలంగాణలో ఇక సాగవన్నారు. మార్పు తుఫాన్‌ వేగంతో తెలంగాణ అంతటా కనిపిస్తోందన్నారు. మంచి పాలనను తెలంగాణ ప్రజలు కోరకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో 8 ఏళ్లుగా అవినీతి పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, యువత కష్టాలు ఎదుర్కొంటోందన్నారు.

తెలంగాణకు ఇప్పుడు ఉన్నది ఒక్కటే ప్రత్యామ్నాయమని, ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ నిలుస్తోందన్నారు. తన ప్రభుత్వం చేజారిపోతోందని కేసీఆర్‌కు అర్థమవుతోందన్నారు. తెలంగాణలో మార్పు రావడం సహజమన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ఓ గిరిజన నేత అయిన ద్రౌపది ముర్ముకు బీజేపీ అవకాశం కల్పించిందన్నారు. ఈ నెల 18న జరిగే ఎన్నికల్లో ఆమె గెలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.