Yadadri: భక్తులకు సూపర్ న్యూస్‌.. యాదాద్రికి ఇకపై మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో ప్రయాణం

యాదాద్రి నర్సింహా స్వామి భక్తులకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి శుభవార్త తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రైలు మార్గాన్ని పొడగిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి గతంలో దీనిపై వార్తలు వచ్చినప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే తాజాగా ఢిల్లీలో మాట్లాడిన కిషన్‌ రెడ్డి తొలిసారి ఈ విషయమై...

Yadadri: భక్తులకు సూపర్ న్యూస్‌.. యాదాద్రికి ఇకపై మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో ప్రయాణం
Yadadri

Updated on: Jun 29, 2023 | 3:23 PM

యాదాద్రి నర్సింహా స్వామి భక్తులకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి శుభవార్త తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రైలు మార్గాన్ని పొడగిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి గతంలో దీనిపై వార్తలు వచ్చినప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే తాజాగా ఢిల్లీలో మాట్లాడిన కిషన్‌ రెడ్డి తొలిసారి ఈ విషయమై అధికారికంగా స్పందించారు. హైదరాబాద్‌ ఎంఎంటీస్‌ రెండో దశను సికింద్రాబాద్‌ నుంచి ఘట్‌కేసర్‌ వరకు పొడగిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిని మరో 33 కిలోమీటర్లు పొడగించడం ద్వారా యాదాద్రి వరకు సేవలను పొడగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులను ప్రారంభించేందుకు వచ్చిన మోదీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు కిషన్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎంఎంటీస్‌ రెండో దశకు కేంద్రం రూ. 330 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కిషన్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో యాదాద్రి వెళ్లే భక్తులకు ఇది గుడ్‌ న్యూస్‌ అని చెప్పొచ్చు. ప్రస్తుతం యాదాద్రికి కేవలం రోడ్డు మార్గమే అందుబాటులో ఉంది. ట్రాఫిక్‌లో పట్టణం దాటడానికి గంటన్నరకు పైగా సమయం పడుతుంది. అయితే ఎంఎంటీస్‌ అందుబాటులోకి వస్తే నగర వాసులకు సులభంగా యాదాద్రికి చేరుకోవచ్చు.

యాదాద్రికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌కు ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులు నడవనున్నాయి. ఇక యాదాద్రి బస్‌స్టాండ్ నుంచి ఇప్పటికే గుట్టపైకి దేవస్థానం ఉచిత బస్సులు నడిపిస్తుండగా, ఎంఎంటీఎస్‌ అందుబాటులోకి వస్తే స్టేషన్‌ నుంచి బస్సులు నడిపే అవకాశాలు ఉన్నాయి. ఎంఎంటీఎస్‌ అందుబాటులోకి వస్తే కేవలం 40 నుంచి 45 నిమిషాల్లో యాదాద్రికి చేరుకోవచ్చు. ప్రయాణ ఖర్చు కూడా భారీగా తగ్గనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..