Hyderabad: మరో ఘరానా మోసం.. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో రూ. 6 కోట్లు స్వాహా.. లబోదిబోమంటున్న బాధితులు..

|

Oct 15, 2022 | 6:34 AM

సినిమా అనేది రంగుల ప్రపంచం. ఎలాగైనా వెండితెరపై వెలిగిపోవాలన్న ఆశ.. తక్కువ కాలంలో బాగా సంపాదించాలన్న తపన.. వారి పాలిట శాపంగా మారింది. విశ్వనగరం హైదరాబాద్‌ స్కాంలకు అడ్డాగా మారుతోంది. నగరంలో...

Hyderabad: మరో ఘరానా మోసం.. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో రూ. 6 కోట్లు స్వాహా.. లబోదిబోమంటున్న బాధితులు..
SI Arrested
Follow us on

సినిమా అనేది రంగుల ప్రపంచం. ఎలాగైనా వెండితెరపై వెలిగిపోవాలన్న ఆశ.. తక్కువ కాలంలో బాగా సంపాదించాలన్న తపన.. వారి పాలిట శాపంగా మారింది. విశ్వనగరం హైదరాబాద్‌ స్కాంలకు అడ్డాగా మారుతోంది. నగరంలో వెలుగు చూస్తున్న మోసాలు చూస్తుంటే నిజమేనన్న అనుమానం కలుగుతోంది. హనీ ట్రాప్‌లతో కొందరు, ఆన్‌లైన్‌ మోసాలతో మరికొందరు.. లోన్‌యాప్‌ల పేరుతో ఇంకొందరు.. ఇలా ఎవరికి తోచిన దారిలో వారు చీటింగ్‌కు పాల్పడుతూ నగర ఖ్యాతిని మంటగలుపుతున్నారు. మోసపోయేవారు ఉన్నంత వరకు మోసం చేసేవారుంటారన్న నానుడి మరోసారి నిరూపితమవుతోంది. సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులు పెడతామంటూ కోట్లకు శఠగోపం పెట్టిన ఘరానా మోసం నగరంలో బయటపడింది. కూకట్‌పల్లి కేంద్రంగా జరిగిన చీటింగ్‌లో ఆరు కోట్ల రూపాయలకు పైగా మోసపోయిన బాధితులు లబోదిబోమంటూ సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వారి బంధువులే టార్గెట్‌గా కోట్ల రూపాయల్లో వసూలు చేసిన నిందితులను అరెస్టు చేయాలంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. RRR, అల వైకుంఠపురం, లవ్ స్టొరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది లాంటి సినిమాల్లో పెట్టుబడులు పెడతామంటూ ఇద్దరు వ్యక్తులు డబ్బు గుంజినట్లు ఆరోపిస్తున్నారు. తమ డబ్బును తిరిగివ్వమంటే.. మంత్రులు తెలుసు.. పెద్దవాళ్లు తెలుసంటూ బెదిరింపులకు దిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బాధితుల ఆందోళనతో రంగంలోకి దిగిన సీసీఎస్‌ పోలీసులు.. ఘరానా చీటర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. ఇప్పటివరకు 30 మంది బాధితులే బయటకు వచ్చినా.. ఈ సంఖ్య భారీగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.