
అధికారుల కళ్లు గప్పి బ్యాంకాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 37 పాములు, తాబేళ్లను శనివారం శంషాబాద్ విమానాశ్రయం అధికారులు పట్టుకున్నారు. ముంబైకి చెందిన షేక్ నిజాముద్దీన్, షేక్ అల్తాఫ్ అలీ బ్యాంకాక్ నుంచి ప్రాణాలతో ఉన్న 28 రెడ్ టెయిల్డ్ బాంబూ పిట్ వైపర్‌లు, 3 స్పైడర్ టెయిల్డ్ హార్మ్‌డ్ వైపర్‌లు, 6 తాబేళ్లను తమ లగేజ్‌లో గుట్టుగా దాచిపెట్టుకుని ఇండిగో ఎయిర్‌లైన్స్ 6ఈ-1066 విమానంలో శంషాబాద్‌లో దిగారు. అనుమానం వచ్చిన అధికారులు వారిని విచారించగా అసలు విషయం బట్టబయలైంది. ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని విమానాశ్రయం అధికారులు తెలిపారు.
ప్రాణాలతో ఉన్న 28 రెడ్ టెయిల్డ్ బాంబూ పిట్ వైపర్‌లు, మూడు స్పైడర్ టెయిల్డ్ హార్మ్‌డ్ వైపర్‌లు, ఆరు తాబేళ్లను తమ సామగ్రిలో రహస్యంగా భద్రపరిచి ఇండిగో ఎయిర్‌లైన్స్ 6ఈ-1066 విమానంలో ప్రయాణించి శంషాబాద్‌లో దిగారు. వారి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన కస్టమ్స్ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని వారి సామగ్రిని తనిఖీ చేయగా వాటిల్లో పాములు, తాబేళ్లు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..