TV9 Sweet Home Expo 2026: ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్.. అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో ప్రారంభం
హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో TV9 Sweet Home Expo 2026 ఘనంగా ప్రారంభమైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మెగా రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోను ప్రారంభించి ప్రత్యేక స్టాల్స్‌ను సందర్శించారు. 80కి పైగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్న ఈ ఎక్స్‌పోలో ఫ్లాట్లు, విల్లాలు, ప్లాట్లు, కమర్షియల్ ప్రాపర్టీలపై సమగ్ర సమాచారం, పెట్టుబడి సలహాలు ఒకే వేదికపై అందుబాటులో ఉన్నాయి. ప్రవేశం పూర్తిగా ఉచితం.

హైదరాబాద్‌లో అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో.. TV9 Sweet Home Expo 2026 ప్రారంభమైంది.. శనివారం, ఆదివారం హైటెక్స్‌లో టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో జరగనుంది. ఈ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు.. పలువురు ప్రతినిధులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలో.. 80కి పైగా రియల్ ఎస్టేట్ కంపెనీల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో నిర్వహించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు (ఎంపీ) రామసహాయం రఘురాం రెడ్డి, టీవీ9 ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Tv9 Sweet Home Expo 2026
TV9 Sweet Home Expo 2026 హైదరాబాద్ హైటెక్స్‌లో ఇవాళ, రేపు జరుగుతుంది. ఈ ఎక్స్‌పో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు, కొనుగోలుదారులను ఒకే వేదికపైకి తీసుకువస్తోంది. ఎక్స్‌పోకి ప్రవేశం అందరికీ ఉచితం.. రెండు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ ఎక్స్‌పో జరగనుంది. ఈ ఎక్స్‌పోలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్నాయి. స్ధిరాస్తుల కొనుగోలు, అమ్మకాలపై సలహాలు, సందేహాలకు సరైన వేదిక ఈ స్వీట్ హోం ఎక్స్‌పో.. ఇక్కడ రియల్ ఎస్టెట్ కు సంబంధించిన అనేక విషయాలపై మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు..
