TSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి ఏపీకి ఆర్టీసీ స్లీపర్‌ బస్సులు.. రూట్స్‌, టైమింగ్స్‌ వివరాలివే

|

Jan 04, 2023 | 8:11 AM

మొదటి దశలో మొత్తం 10 బస్సులు సమకూరనుండగా.. వీటిలో 4 పూర్తి స్లీపర్‌ బస్సులు కాగా.. 6 స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సులున్నాయి. హైదరాబాద్‌ - కాకినాడ, హైదరాబాద్‌ - విజయవాడ మధ్య ఈ బస్సులు తిరగనున్నాయి.

TSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి ఏపీకి ఆర్టీసీ స్లీపర్‌ బస్సులు.. రూట్స్‌, టైమింగ్స్‌ వివరాలివే
Tsrtc
Follow us on

ఏపీకి వెళ్లి వచ్చే ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం తొలిసారిగా స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. కేపీహెచ్‌బీ కాలనీ బస్సు స్టాపు దగ్గర బుధవారం (జనవరి4) సాయంత్రం 4 గంటలకు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ ఈ బస్సులను ప్రారంభించనున్నారు. మొదటి దశలో మొత్తం 10 బస్సులు సమకూరనుండగా.. వీటిలో 4 పూర్తి స్లీపర్‌ బస్సులు కాగా.. 6 స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సులున్నాయి. హైదరాబాద్‌ – కాకినాడ, హైదరాబాద్‌ – విజయవాడ మధ్య ఈ బస్సులు తిరగనున్నాయి. ఈ స్లీపర్‌ బస్సుల్లో లోయర్‌ బెర్తులు 15, అప్పర్‌ బెర్తులు 15 ఉండనున్నాయి. ప్రతీ బెర్త్‌ వద్ద వాటర్‌ బాటిల్‌ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్‌ చార్జింగ్‌ పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. సీటర్‌ కం స్లీపర్‌ బస్సుల్లో 15 అప్పర్‌ బెర్తులతో పాటు లోయర్‌ లెవల్‌లో 33 సీట్ల సామర్థ్యం ఉంటుంది. ప్రతి బస్సుకు ఎయిర్‌ సస్పెన్షన్‌ ఫెసిలిటీ ఉంటుంది. ఈ బస్సుల్లో ప్రయాణించే వారికి ఒక వాటర్‌ బాటిల్‌తో పాటు ఫ్రెష్‌నర్‌ను ఫ్రీగా అందజేస్తారు. లగేజీ లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు సహకరించేందుకు అటెండెంట్లు కూడా ఉంటారు. బస్సుకు ముందు వెనక ఎల్‌ఈడీ బోర్డులుంటాయి. గమ్యస్థానాల వివరాలు తెలుగు, ఇంగ్లిషు భాషల్లో కనిపిస్తాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫ్రంట్‌ రోడ్‌ వ్యూ, ప్రయాణికులు బస్సు ఎక్కే ప్రాంతం, బస్సు లోపలి ప్రాంతంలో ఈ కెమెరాలుంటాయి. ఇక అగ్నిప్రమాదాలను నివారించేందుకు అగ్నిమాపక పరికరాలు కూడా బస్సుల్లో ఏర్పాటుచేశారు.

టైమింగ్స్‌ ఇవే..

* కాకినాడ వైపు వెళ్లే బస్సులు బీహెచ్‌ఈఎల్‌ నుంచి బయలుదేరుతాయి. ప్రతిరోజూ రాత్రి 7.45, 8.30 గంటలకు ఈ బస్సులు బయలుదేరుతాయి. అలాగే కాకినాడ నుంచి హైదరాబాద్‌కు రాత్రి 7.15 గంటలకు, 7.45 గంటలకు తిరుగు ప్రయాణమవుతాయి.

ఇవి కూడా చదవండి

* విజయవాడ వైపు వెళ్లే బస్సులు ప్రతిరోజూ మియాపూర్‌ నుంచి ఉదయం 9.30, 10.45, 11.45 గంటలకు, రాత్రి 9.30, 10.15, 11.15 గంటలకు బయలుదేరుతాయి. విజయవాడ నుంచి ఉదయం 10.15, 11.15, మధ్యాహ్నం 12.15 గంటలకు, అర్ధరాత్రి 12.00, 12.45 గంటలకు తిరుగు ప్రయాణమవుతాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..