National Integration Day: ఇవాళ్టి నుంచి టీఆర్‌ఎస్‌ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు.. అన్ని నియోజకవర్గాల్లో జాతీయ జెండాతో బైక్‌ ర్యాలీలు

|

Sep 16, 2022 | 8:48 AM

National Integration Day Celebrations: అధికార టీఆర్‌ఎస్‌. ఇటు బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుతుండగా.. అటు జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతోంది తెలంగాణ ప్రభుత్వం. పోటాపోటీగా కార్యక్రమాలు..

National Integration Day: ఇవాళ్టి నుంచి టీఆర్‌ఎస్‌ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు.. అన్ని నియోజకవర్గాల్లో జాతీయ జెండాతో బైక్‌ ర్యాలీలు
Trs Bike Rally
Follow us on

బీజేపీకి దీటుగా బదులిస్తోంది టీఆర్‌ఎస్‌. బీజేపీకి పోటీగా NTR గ్రౌండ్‌లో భారీ సభ నిర్వహిస్తోంది అధికార టీఆర్‌ఎస్‌. ఇటు బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుతుండగా.. అటు జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతోంది తెలంగాణ ప్రభుత్వం. పోటాపోటీగా కార్యక్రమాలు చెపడుతున్నాయి. ఎన్టీఆర్ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం భారీ సభ నిర్వహించనుంది. నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాల్ని నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అన్ని నియోజకవర్గాల్లో జాతీయ జెండాలు చేతబట్టి బైక్‌ ర్యాలీలు నిర్వహించనుంది టీఆర్‌ఎస్‌. సిరిసిల్ల, వేములవాడలో నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్‌ పాల్గొంటారు. హైదరాబాద్‌లో సిటీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా వరకు ర్యాలీలు చేపట్టనున్నారు. రేపు ఎన్టీఆర్ గార్డెన్‌లో వేడుకలు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

నగరంలో ఏర్పడనున్న సున్నితమైన వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని.. పోలీస్ డిపార్ట్ మెంట్ అలెర్ట్ అయ్యింది. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఏర్పాట్లు చేయనుంది. శాంతియుతంగా సెప్టెంబర్ 17 వేడుకలు జరుపుకోవాలని సూచిస్తోంది. ప్రత్యేకించీ సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదంటున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..