AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandla Ganesh: కూకట్‌పల్లి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బండ్ల గణేశ్‌ పోటీ..? రేవంతన్న అంటూ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ సినీ నిర్మాత

తెలంగాణలో ఎన్నికల కౌంట్ డౌన్ మొదలయ్యింది. రేపో, మాపో.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే.. అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ఓ అడుగు ముందుకేసి ప్రచారాన్ని ముమ్మరం చేసింది.. అయితే.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.

Bandla Ganesh: కూకట్‌పల్లి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బండ్ల గణేశ్‌ పోటీ..? రేవంతన్న అంటూ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ సినీ నిర్మాత
Bandla Ganesh
Shaik Madar Saheb
|

Updated on: Oct 08, 2023 | 11:53 AM

Share

తెలంగాణలో ఎన్నికల కౌంట్ డౌన్ మొదలయ్యింది. రేపో, మాపో.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే.. అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ఓ అడుగు ముందుకేసి ప్రచారాన్ని ముమ్మరం చేసింది.. అయితే.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. కొన్ని రోజుల్లో రెండూ పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికే కసరత్తులను ప్రారంభించింది. అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ ఇవాళ భేటీ కానుంది. ఈ తరుణంలో చరిష్మా గల నేతలు ఎవరున్నారు..? ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై చర్చ నడుస్తోంది. అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్థిక, అంగబలం ఉన్న నేతలు ఎవరున్నారు..? అనే దానిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ తరుణంలో కూకట్‌పల్లి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ ప్రయత్నం చేస్తున్నారని.. టికెట్ కోసం అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది.. గ్రేటర్‌లో బలమైన సామాజిక వర్గం, అన్ని అవకాశాలున్న నేతలకు టికెట్ ఇవ్వాలని భావిస్తున్న తరుణంలో.. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేసిన కూకట్‌పల్లి సీటుకు బండ్ల గణేష్ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ ఆదివారం క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. కూకట్‌పల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారనే ప్రచారం నేపథ్యంలో బండ్ల గణేశ్‌ ట్వీట్‌ చేసి.. పోటీ చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ‘‘ఈసారి జరిగే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాకు అవకాశం ఇస్తామని చెప్పారు. కానీ, ఈసారి టికెట్ వద్దు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ముఖ్యం.. దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి. నేను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే నా ధ్యేయం.. తప్పకుండా అధికారంలోకి వస్తుంది. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం’’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేసి.. కూకట్‌పల్లి కాంగ్రెస్ టికెట్ పై క్లారిటీ ఇచ్చారు.

ఇదిలాఉంటే.. ఈ రోజు జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో దాదాపు 60 నుంచి 80 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ రెండు మూడు రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుందన్న ఊహగానాలతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. లిస్టులో ఎవరి పేరు ఉంటుంది.. ? ఎవరి పేరు ఉండదు అనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్