హైదరాబాద్: ఎన్‌ఐటీలలో ప్రవేశానికి, ఐఐటీ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత పొందేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్ రిజల్ట్స్ సోమవారం వెల్లడి కానున్నాయి. గత డిసెంబరులో తొలిసారి జేఈఈ మెయిన్ జరిగింది. ఈ నెల 7 నుంచి 5 రోజుల పాటు రెండో విడత మెయిన్ పరీక్ష నిర్వహించారు. ఈ రెండింటిలో వచ్చిన ఉత్తమ మార్కులను పరిగణనలోకి తీసుకొని ఎన్‌టీఏ ర్యాంకులను కేటాయించనుంది. దేశవ్యాప్తంగా మొదటిసారి 10.50 లక్షల మంది పరీక్ష రాయగా, రెండోసారి సుమారు 9 లక్షల మంది హాజరయ్యారు. రెండు పరీక్షలు రాసిన వారు 6.5 లక్షల మంది ఉన్నారు.