Hyderabad: కార్‌ షో రూమ్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అత్తాపూర్ లో కార్ షోరూమ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పిల్లర్ నెంబర్ 185 వద్ద ఉన్న ఆదర్శ్ ఆటోమొబైల్ సుజుకి కార్ షోరూం సర్వీస్ సెంటర్లో కార్లు తగలబడ్డాయి. సర్వీస్ సెంటర్ స్క్రాప్ గోడౌన్ నుంచి మంటలు చెలరేగడంతో 3 కార్లు తగలబడ్డాయి. ప్రమాద సమయంలో సుమారు 50 కి పైగా వాహనాలు సర్వీస్ సెంటర్‌లో ఉన్నాయి. పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాసులు గుర్తించి ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించడంతో అలర్ట్ అయిన..

Hyderabad: కార్‌ షో రూమ్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Car Showroom Fire Accident In Hyderabad

Updated on: Feb 10, 2026 | 6:49 AM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10: అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 185 వద్ద ఉన్న ఆదర్శ్ ఆటోమొబైల్స్ సుజుకి కార్ల షోరూంలో మధ్య రాత్రి 1:20 నిమిషాలకు ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో షోరూంలో సుమారు 50 నుంచి 70 కార్లు ఉన్నాయి షోరూం సర్వీస్ సెంటర్ లో ఉన్న స్క్రాప్ గోదాం నుంచి మంటలు భారీ ఎత్తున వ్యాపించి సుమారు నాలుగు ఐదు కార్ లు తగలబడ్డాయి. పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాసులు మంటలను గమనించి ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించటం తో నిమిషాల వ్యవధిలో అగ్నిమాపక సిబ్బంది రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే రెండు ఫైరింజన్‌లతో మంటలను అదుపు చేయటంతో ఘోర ప్రమాదం తప్పింది. ప్రమాదానికి షో రూమ్ నిర్వాహకుల అలసత్వమే కారణమని వేస్ట్ ఆయిల్స్ బ్యాటరీలు అన్నీ కలిపి ఒకే దగ్గర పెట్టడంతో ప్రమాదం సంబంధించిందని స్థానికులు అంటుండగా.. ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ పని చేసి ఉంటారని షోరూం నిర్వాహకులు అంటున్నారు.

ముందు జాగ్రత్తగా అపార్ట్మెంట్లో ఉన్న 90 ఫ్యామిలీలను పోలీసులు ఖాళీ చేయించారు. షోరూం నిర్వాహకుల అశ్రద్ధ వల్లే ప్రమాదం సంభవించిందని కాలనీవాసులు అంటున్నారు. అయితే ఎవరో ఉద్దేశపూర్వకంగా నిప్పు అంటించి ఉంటారని షోరూమ్ నిర్వాహకులు అంటున్నారు. దీనిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి సిసిటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.