Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాదీలు మాములోల్లు కాదండి బాబు.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లోనూ సరికొత్త రికార్డు

ఇక న్యూ ఇయర్‌ జోష్‌లో ప్రజలు తెగ తాగేశారు. రెండు తెలుగు రాష్ట్రాల రికార్డ్‌ స్థాయిలో జరిగిన మద్యం అమ్మకాలే దీనికి నిదర్శనం. ఇక తాగిన వాళ్లు తాగినట్లు ఉండకుండా వాహనలపై చక్కర్లు కొట్టారు. పోలీసులు ఊరుకుంటారా.? డ్రంక్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టి మందుబాబుల పనిపట్టారు. హైదరాబాద్‌, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కలిసి 3వేల 258కుపైగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదుచేశారు...

హైదరాబాదీలు మాములోల్లు కాదండి బాబు.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లోనూ సరికొత్త రికార్డు
Drunk And Drive
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Jan 02, 2024 | 12:28 PM

ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఎంతో సంతోషంగా ప్రజలంతా కొత్తేడాదికి వెల్‌కమ్‌ చెప్పారు. ఇక హైదరాబాదీలు కూడా న్యూఇయర్‌ వేడుకలు గట్టిగానే జరుపుకున్నారు. హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. అర్ధరాత్రి దాటేదాక రోడ్లపై తిరుగుతూ, పటాకులు కాలుస్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు.

ఇక న్యూ ఇయర్‌ జోష్‌లో ప్రజలు తెగ తాగేశారు. రెండు తెలుగు రాష్ట్రాల రికార్డ్‌ స్థాయిలో జరిగిన మద్యం అమ్మకాలే దీనికి నిదర్శనం. ఇక తాగిన వాళ్లు తాగినట్లు ఉండకుండా వాహనలపై చక్కర్లు కొట్టారు. పోలీసులు ఊరుకుంటారా.? డ్రంక్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టి మందుబాబుల పనిపట్టారు. హైదరాబాద్‌, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కలిసి 3వేల 258కుపైగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదుచేశారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 1500లకుపైగా కేసులు నమోదవగా, సైబరాబాద్‌లో ఇద్దరు మహిళలతోపాటు తాగి వాహనాలు నడిపన 1239 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

తాగి డ్రైవింగ్‌ చేసిన కేసుల్లో 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండలో 517 కేసులు నమోదైయ్యాయి. న్యూఇయర్‌ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నవారికి బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేసి.. వాహనాలను సీజ్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుపోతున్న వారినిలను పోలీసులు పట్టుకున్నారు..పలుచోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. జంట నగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఆ నగరాలతో పోల్చితే..

ఇక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లోనూ హైదరాబాదీలు ఓ రికార్డు సృష్టించారండి. ఢిల్లీ, ముంబయి, బెంగళూరులో నమోదైన మొత్తం డ్రంక్‌ డ్రైవ్‌ కేసులతో పోల్చితే హైదరాబాద్‌లో నమోదైన కేసులు మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. డిసెంబర్‌ 31న మద్యం సేవించి వాహనం నడిపినందుకు ఢిల్లీ పోలీసులు 495 చలాన్లు జారీ చేయగా, ముంబయిలో 283 మందికి చలాన్లు జారీ చేశారు. ఇక బెంగళూరు విషయానికొస్తే అక్కడ 330 కేసులు నమోదుకాగా, హైదరాబాద్‌లో ఏకంగా 3000 కేసులు నమోదయ్యాయి.

మద్యం అమ్మకాలు ఇలా..

తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ సేల్స్ జోరుగా సాగాయి. నాలుగు రోజుల్లో రూ.750 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి..న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 30, ఒక్కరోజే రూ.313 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అలాగే డిసెంబర్ 31న రూ. 125 కోట్ల విక్రయాలు, డిసెంబర్ 28న రూ. 133 కోట్లు, డిసెంబర్ 29న రూ. 179 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని అంచనా.

అటు బెంగళూరులో న్యూఇయర్ సందర్భంగా డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకు ఏకంగా రూ. 1,262 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. ఢిల్లీలో డిసెంబర్ 31న ఒక్క రోజే రూ. 218 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..