Hyderabad: మేడ్చల్ లో ఘోర ప్రమాదం.. లారీని ఓవర్ టేక్ చేయబోయి.. అదుపుతప్పి ముగ్గురు మృతి

|

Sep 12, 2022 | 11:01 AM

హైదరాబాద్ (Hyderabad) లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పరిధిలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వీరిలో ఒకరు మహిళ ఉన్నారు. మేడ్చల్ నుంచి...

Hyderabad: మేడ్చల్ లో ఘోర ప్రమాదం.. లారీని ఓవర్ టేక్ చేయబోయి.. అదుపుతప్పి ముగ్గురు మృతి
Accident
Follow us on

హైదరాబాద్ (Hyderabad) లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పరిధిలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వీరిలో ఒకరు మహిళ ఉన్నారు. మేడ్చల్ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసే సమయంలోలారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణీస్తున్న మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా (Accident) స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరుపై వివరాలు సేకరించారు. సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపటత్తటారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంటి నుంచి బయల్దేరిన వాళ్లు సురక్షితంగా చేరుకుంటారనుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో మృతుల కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం