కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రయాణికులకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. నో మాస్క్ నో ఎంట్రీ ఆదేశాలు ఇచ్చింది. రైల్వే అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. మాస్క్ లేని ప్రయాణికులకు జరిమానా విధించారు. టికెట్ ఉన్నా మాస్క్ లేకుంటే బయటకు పంపించేస్తామని చెప్పారు. మాస్క్ లేకపోతే 500 రూపాయల ఫెనాల్టీ విధిస్తామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు.
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. చాపకింద నీరులా విస్తరిస్తున్న కేసులతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. మహారాష్ట్రలో 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్ జైపూర్‌లో ఒకే కుటుంబంలోని 9 మందికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కావడం కలకలం రేపింది. దేశంలో నమోదైన కేసుల్లో దాదాపు అందరూ ఇటీవల ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చినవారు ఉన్నారు. అయితే తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని మంత్రి హరీశ్ రావు చెప్పారు.
Read Also.. Shreya Muralidhar: గుండెపోటుతో యంగ్ యూట్యూబర్ ఆకస్మిక మరణం..ప్రదీప్‌తో ‘పెళ్లి చూపులు’ షో
Strange Sounds: చిత్తూరు జిల్లాలో హడలెత్తిస్తున్న వింత శబ్దాలు.. వరుస ప్రకంపనలతో జనం పరుగులు..