
ఐటీ, టూరిజం రంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్‌లో మరో భారీ ప్రాజెక్ట్ రానుంది. దేశంలోని పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన ఆక్వేరియం మన భాగ్య నరగంలోనూ సందడి చేయనుంది. ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తికాగా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఈ ఆక్వేరియాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు.? దీని ప్రత్యేకత ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లా్ల్సిందే..
దేశంలోనే అతిపెద్ద ఆక్వేరియంగా నిలవనున్న ఈ కట్టడాన్ని రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ నిర్మాణం పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. కొత్వాల్‌గూడలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎకో పార్క్‌లో ఈ ఆక్వేరియాన్ని నిర్మిస్తున్నారు. పక్షుల ఆవాస కేంద్రంగానూ దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఈ ఆక్వేరియం త్వరలోనే సందర్శకులకు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
We are building India’s largest Aquarium and Aviary at Kothwalguda. Work is in progress
Will have @arvindkumar_ias and @HMDA_Gov share pictures and details https://t.co/Jm1vs5EM2p
— KTR (@KTRBRS) April 17, 2023
హైదరబాద్‌లో టన్నెల్ ఆక్వేరియం ఎందుకు ఉండకూడదన్న ఓ నెటిజన్ ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మంత్రి కేటీఆర్.. ‘దేశంలోనే అతిపెద్ద అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియాన్ని నిర్మిస్తున్నాము. ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి’ అని రాసుకొచ్చారు. అలాగే ఈ నిర్మాణానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేయాలని అధికారులు సూచించారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..