ఆంధ్రా ఎన్నికలపై తలసాని జోస్యం

హైదరాబాద్‌: గత కొంతకాలంగా టీడీపీ అధినేత, ఏపీ సిఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏపీ ఎన్నికలలో ఎవరెన్ని సీట్ల గెలుస్తారన్న విషయంపై తలసాని జోస్యం చెప్పారు. అధికార, విపక్ష పార్టీల మధ్య నెలకొన్న ఉత్కంఠ పోరులో వైసీపీ విజయకేతనం ఎగరవేస్తుందని ఆయన అన్నారు. వైకాపా 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు, 22 నుంచి 23 లోక్‌సభ స్థానాల్లో గెలవబోతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ […]

ఆంధ్రా ఎన్నికలపై తలసాని జోస్యం

Updated on: Mar 20, 2019 | 8:25 PM

హైదరాబాద్‌: గత కొంతకాలంగా టీడీపీ అధినేత, ఏపీ సిఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏపీ ఎన్నికలలో ఎవరెన్ని సీట్ల గెలుస్తారన్న విషయంపై తలసాని జోస్యం చెప్పారు. అధికార, విపక్ష పార్టీల మధ్య నెలకొన్న ఉత్కంఠ పోరులో వైసీపీ విజయకేతనం ఎగరవేస్తుందని ఆయన అన్నారు. వైకాపా 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు, 22 నుంచి 23 లోక్‌సభ స్థానాల్లో గెలవబోతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై కూడా తలసాని మండిపడ్డారు. అభివృద్ధి జరగనిదే అత్యదిక మోజార్టీతో టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితమైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన భాజపా కూడా తమపై విమర్శలు చేస్తోందని తలసాని విమర్శించారు.