సిటీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. ఆ బస్ పాస్ ధర భారీగా తగ్గింపు

| Edited By: Ram Naramaneni

Jun 08, 2024 | 10:24 PM

మీరు హైదరాబాద్ సిటీ బస్సుల్లో నిత్యం ప్రయాణాలు చేస్తుంటారా..? అయితే మీకే ఈ గుడ్ న్యూస్. ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్‌ గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణించే ప్యాసింజర్స్ కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆ బస్సుల నెలవారీ బస్‌ పాస్‌ రేటును భారీగా తగ్గించింది. కేవలం 1900 రూపాయలకే ఈ బస్‌ పాస్‌ను అందజేస్తోంది. గతంలో ఈ బస్‌ పాస్‌ ధర రూ.2530 ఉండగా.. ప్రయాణికులపై భారం తగ్గించేందుకు తాజాగా రూ.630 తగ్గించింది.

సిటీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. ఆ బస్ పాస్ ధర భారీగా తగ్గింపు
Bus
Follow us on

మీరు హైదరాబాద్ సిటీ బస్సుల్లో నిత్యం ప్రయాణాలు చేస్తుంటారా..? అయితే మీకే ఈ గుడ్ న్యూస్. ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్‌ గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణించే ప్యాసింజర్స్ కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆ బస్సుల నెలవారీ బస్‌ పాస్‌ రేటును భారీగా తగ్గించింది. కేవలం 1900 రూపాయలకే ఈ బస్‌ పాస్‌ను అందజేస్తోంది. గతంలో ఈ బస్‌ పాస్‌ ధర రూ.2530 ఉండగా.. ప్రయాణికులపై భారం తగ్గించేందుకు తాజాగా రూ.630 తగ్గించింది.

ఈ బస్సు పాస్‌ కలిగి ఉంటే.. 219 రూట్ సికింద్రాబాద్-పటాన్‌ చెరువు, 195 రూట్ బాచుపల్లి – వేవ్ రాక్ సర్వీసుల్లో నడిచే గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ట్రావెల్ చెయ్యొచ్చు. అంతే కాదండోయ్, ఈ బస్‌పాస్‌తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులతో పాటు ఈ-మెట్రో ఎక్స్‌ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో సైతం ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ఐతే విమానాశ్రయం రూట్ లో నడిచే పుష్ఫక్‌ ఏసీ బస్సుల్లో ఈ పాస్ చెల్లుబాటు కాదు.

అలాగే, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు పాస్ ఉన్నవారు రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని.. గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఒక ట్రిప్పులో ట్రావెల్ చేయొచ్చని అధికారులు తెలిపారు. నగరంలోని TGSRTC బస్సు పాస్ కేంద్రాలలో ఈ పాస్‌లు అందుబాటులో ఉంటాయి.