Telangana: తెలంగాణ విద్యార్ధులకు అలెర్ట్.. సమ్మర్ హాలిడేస్ ఇవే.. మరి రిజల్ట్స్ ఎప్పుడంటే?

|

Apr 11, 2023 | 8:13 PM

తెలంగాణ విద్యార్ధులకు అలెర్ట్. సమ్మర్ హాలిడేస్‌పై కీలక అప్డేట్ వచ్చేసింది. 1-9 తరగతుల విద్యార్ధులకు ఏప్రిల్ 12 నుంచి పరీక్షలు..

Telangana: తెలంగాణ విద్యార్ధులకు అలెర్ట్.. సమ్మర్ హాలిడేస్ ఇవే.. మరి రిజల్ట్స్ ఎప్పుడంటే?
School Students
Follow us on

తెలంగాణ విద్యార్ధులకు అలెర్ట్. సమ్మర్ హాలిడేస్‌పై కీలక అప్డేట్ వచ్చేసింది. 1-9 తరగతుల విద్యార్ధులకు ఏప్రిల్ 12 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే 1-5 తరగతులకు కేవలం నాలుగు సబ్జెక్టులు మాత్రమే ఉండటంతో.. వీరికి ఏప్రిల్ 17తో ఎగ్జామ్స్ పూర్తవుతాయి. అలాగే 6-9 తరగతుల విద్యార్ధులకు ఏప్రిల్ 20న పరీక్షలు ముగుస్తాయి.

ఇక ఈ పరీక్షా ఫలితాలు 21న ప్రకటిస్తారు. అనంతరం ఏప్రిల్ 24న పేరెంట్స్ మీటింగ్.. ఆ తర్వాత ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. అంతే! దాదాపు 48 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. కాగా, 2023-24 విద్యా సంవత్సరం తిరిగి జూన్ 12 నుంచి మొదలు కానుంది.