తెలంగాణ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. వచ్చే మూడు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 21 శుక్రవారం జుమాతుల్ విదా నేపధ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ఆప్షనల్ సెలవును ప్రకటించింది. ఇక హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో రేపు విద్యాసంస్థలకు హాలీడే. జిల్లాల విషయానికొస్తే.. అక్కడి పరిస్థితుల బట్టి.. అధికారులు ఈ సెలవును ఇస్తారు.
అటు ప్రభుత్వం ఏప్రిల్ 22, 23 ఈద్-ఉల్-ఫితర్(రంజాన్), రంజాన్ ఫాలోయింగ్ డే గానూ అఫీషియల్ సెలవులను ప్రకటించింది. ఒకవేళ నెలవంక రేపు సాయంత్రం కనిపిస్తే.. ఎల్లుండి అనగా శనివారం నాడు రంజాన్ జరుపుకుంటారు. అలా కాదు శనివారం సాయంత్రం నెలవంక కనిపిస్తే.. ఆదివారం రంజాన్ జరుపుకుంటారు.
కాగా, 1-9 తరగతుల విద్యార్ధులకు ఏప్రిల్ 20తో పరీక్షలు ముగియనున్నాయి. ఆ తర్వాత పరీక్షా ఫలితాల వెల్లడి 21న, ఏప్రిల్ 24న పేరెంట్స్ మీటింగ్స్ ఉంటాయి. ఇక ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈసారి 48 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. కాగా, 2023-24 విద్యా సంవత్సరం తిరిగి జూన్ 12 నుంచి మొదలు కానుంది.