
నేటి తరానికి తెలియదు కానీ.. ఒకానొక సమయంలో భాగ్యనగరం అంటే.. వెంటనే అందరికి గుర్తుకొచ్చేది.. చార్మినార్. గోల్కొండ, ట్యాంక్ బండ్ లతో పాటు డబుల్ డెక్కర్ బస్సులు. అయితే ఈ డబుల్ డెక్కర్ బస్సులు కాలక్రమంలో కనుమరుగయ్యాయి. ప్రస్తుత తరంలో ఈ డబుల్ డెక్కర్ బస్సులను ఎప్పుడైనా సినిమాల్లో చూడడమే తప్పించి.. నగరంలో రోడ్లమీద చూసింది లేదు. అయితే విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న భాగ్యనగరంలో కొత్త హంగులు సంతరించుకుంటున్న నేపథ్యంలో ఈ డబుల్ డెక్కర్ బస్సులు మళ్ళీ హైదరాబాద్ వాసులకు కనువిందు చేయడానికి రానున్నాయట. రానున్న రోజుల్లో మళ్ళీ రోజుల్లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు భాగ్యనగరంలో తిరగనున్నాయి. వీటిని పునరుద్ధరించడంపై తెలంగాణ ఆర్టీసీ దృష్టి సారించింది.
హైదరాబాద్ నగర పరిధి రోజు రోజుకీ విస్తారిస్తోంది. దీంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆర్టీసీ కొత్త బస్సులను సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలోనే టీఎస్ ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కు ఈ ఏడాది 300, వచ్చే ఏడాది మరో 310 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ బస్సులే కావడం విశేషం. వచ్చే ఏడాది నుంచి అద్దె ప్రాతిపదికన మరి కొన్ని బస్సులను తీసుకోనున్నట్లు సమాచారం. ఇందులో 10 డబుల్ డెక్కర్ బస్సులున్నాయి. ఇందుకు సంబంధించి నవంబర్ 21 వరకు టెండరు దాఖలు చేయాలని టీఆర్‌సీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రజారవాణా అనకూలంగా ఉండాలనే ఉద్దేశంతో డబుల్ డెక్కర్ బస్సులు కొనాలని టీఎస్ ఆర్టీసీ భావించింది. గతంలో టెండర్లు సైతం పిలిచింది. వచ్చే ఏడాది మొదటి నాటికి 10 డబుల్ డెక్కర్లతో పాటు 300 ఎలక్ట్రిక్ బస్సులు అద్దె ప్రాతిపాదికన సమకూర్చుకోనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..