తెలంగాణ ఒలింపిక్‌ సంఘం ఎన్నికలు హైదరాబాద్‌లోనే!

| Edited By:

Feb 03, 2020 | 8:47 PM

తెలంగాణ ఒలింపిక్‌ సంఘం ఎన్నికలు హైదరాబాద్‌లోనే నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తెలంగాణ ఒలింపిక్‌ భవన్‌, సంఘం కార్యాలయాలన్నీ ఇక్కడే పెట్టుకుని ఢిల్లీలో నిర్వహిస్తామంటే కుదరదని వ్యాఖ్యానించింది. ఓటర్ల జాబితా తయారీపై కూడా అభ్యంతరాలను వ్యక్తం చేసిన హైకోర్టు.. రెండు పర్యాయాలు ప్రధాన కార్యాదర్శిగా పనిచేసిన వ్యక్తి మరోసారి ఎలా పోటీ చేస్తారని జగదీశ్‌ యాదవ్‌ను సూటిగా ప్రశ్నించింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల తతంగం.. లోపభూయిష్టంగా, విమర్శలకు తావిచ్చేందుకు ఉందని జగదీష్‌ వర్గానికి అక్షింతలు వేసింది […]

తెలంగాణ ఒలింపిక్‌ సంఘం ఎన్నికలు హైదరాబాద్‌లోనే!
Follow us on

తెలంగాణ ఒలింపిక్‌ సంఘం ఎన్నికలు హైదరాబాద్‌లోనే నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తెలంగాణ ఒలింపిక్‌ భవన్‌, సంఘం కార్యాలయాలన్నీ ఇక్కడే పెట్టుకుని ఢిల్లీలో నిర్వహిస్తామంటే కుదరదని వ్యాఖ్యానించింది. ఓటర్ల జాబితా తయారీపై కూడా అభ్యంతరాలను వ్యక్తం చేసిన హైకోర్టు.. రెండు పర్యాయాలు ప్రధాన కార్యాదర్శిగా పనిచేసిన వ్యక్తి మరోసారి ఎలా పోటీ చేస్తారని జగదీశ్‌ యాదవ్‌ను సూటిగా ప్రశ్నించింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల తతంగం.. లోపభూయిష్టంగా, విమర్శలకు తావిచ్చేందుకు ఉందని జగదీష్‌ వర్గానికి అక్షింతలు వేసింది హైకోర్టు. రేపు ఓటర్ల జాబితా, ఎన్నికల అధికారి నియామకం, జయేష్‌ నామినేషన్‌పై కూడా రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.