తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌ వాయిదా

| Edited By: Ravi Kiran

Dec 31, 2019 | 8:22 AM

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌ ఈ నెల 11కు వాయిదా పడింది. మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్ పై ఇవాళ హైకోర్టు లో విచారణ జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. వార్డుల విభజన, జనాభా ప్రక్రియ పై లోపాలను సరి చేసామని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ కోర్ట్ కు తెలిపారు. ప్రభుత్వం చెబుతున్న దానికి పొంతన లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. చిన్న చిన్న లోపాలను భూతద్దంలో […]

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌ వాయిదా
Follow us on
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌ ఈ నెల 11కు వాయిదా పడింది. మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్ పై ఇవాళ హైకోర్టు లో విచారణ జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. వార్డుల విభజన, జనాభా ప్రక్రియ పై లోపాలను సరి చేసామని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ కోర్ట్ కు తెలిపారు. ప్రభుత్వం చెబుతున్న దానికి పొంతన లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. చిన్న చిన్న లోపాలను భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని హైకోర్టు తెలిపింది. వార్డుల విభజన లో మార్పులు ఉన్నట్లయితే ఆ పరిధిలోనే ఉంటాయని వాఖ్యానించింది. వార్డుల విభజన వలన ఓటర్ల పరిధి ఒక జిల్లా నుండి ఇంకొక జిల్లాకు అయితే మారడం లేదని కోర్టు స్పష్టం చేసింది.. ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరి చేసుకోవాలని ప్రభుత్వం కు హైకోర్టు సూచించింది. బుధవారం మరోసారి పూర్తి వాదనలు వింటామన్న హైకోర్టు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.