Vemula Prashanth: “రైతులను కడుపులో పెట్టుకుని చూసుకునేది కేసీఆర్ మాత్రమే”.. మరోసారి రుజువైందన్న మంత్రి

|

Apr 13, 2022 | 12:07 PM

ఏనాటికైనా రైతులను కడుపులో పెట్టుకుని చూసుకునేది కేసీఆర్(KCR) మాత్రమేననే విషయం మరోసారి రుజువైందని తెలంగాణ(Telangana) రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashant Reddy) అన్నారు.....

Vemula Prashanth: రైతులను కడుపులో పెట్టుకుని చూసుకునేది కేసీఆర్ మాత్రమే.. మరోసారి రుజువైందన్న మంత్రి
Vemula Prashanth Reddy
Follow us on

ఏనాటికైనా రైతులను కడుపులో పెట్టుకుని చూసుకునేది కేసీఆర్(KCR) మాత్రమేననే విషయం మరోసారి రుజువైందని తెలంగాణ(Telangana) రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashant Reddy) అన్నారు. యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వరి వేయాలని బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్, రా రైస్ అయినా బాయిల్డ్ రైస్ అయినా కేంద్రమే కొనుగోలు చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రైతులను రెచ్చగొట్టారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించిందని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని, క్వింటాలుకు రూ.1960 రూపాయల మద్దతు ధరతో తామే కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆనందంగా ఉందని మరోమారు చెప్పారు.

దేశంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. యాసంగిలో ధాన్యం తీసుకోం అని కేంద్రం చెబితే ధాన్యం తీసుకునేలా నిరసనలు చేశాం. తీర్మానాలు చేశాం. అన్ని విధాలా వ్యతిరేకత వ్యక్తం చేశాం. చివరికి సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీలో రైతు దీక్ష చేపట్టినా.. కేంద్రం స్పందించలేదు. తెలంగాణలో నూకల బియ్యం వస్తాయని, వాటిని తీసుకోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెబితే కేంద్రమే ధాన్యం కొనేలా మేము ఒప్పిస్తామని ఇక్కడి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పుడు ఆ ఇద్దరూ కనిపించకుండా పోయారు. నూకల నష్టం కూడా రైతులపై పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఎవరు దొంగలు.. ఎవరు రైతుల పక్షపాతి అనేది స్పష్టమయింది.

                        – వేముల ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ మంత్రి

Also Read

Yash: యశ్ క్రేజ్ అంటే ఇట్లుంటది మరి.. 20 వేల పుస్తకాలతో ఫ్యాన్స్ వరల్డ్ రికార్డ్..

Sonam Kapoor: హీరోయిన్ ఇల్లు గుల్ల.. సాంతం దోచుకెళ్లిన దొంగ !!

PNB: కస్టమర్లకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు గుడ్‌న్యూస్‌.. కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు.. ఎలాగంటే..!