‘ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు’.. తెలంగాణ గవర్నర్‌‌పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు..

|

Apr 20, 2022 | 12:20 PM

గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్..

ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు.. తెలంగాణ గవర్నర్‌‌పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు..
Follow us on

కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్ మీట్స్ పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని విమర్శించారు. తమది ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వమని.. నామినేటెడ్ వ్యక్తులం కాదని తెలిపారు.

గవర్నర్లు ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వంపై ఆరోపణలు సరికాదు. ఉపరాష్ట్రపతి,గవర్నర్ అనే రోల్ చాలా తక్కువ. గవర్నర్‌గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి వారి ప్రోటోకాల్ విషయంలోనే కొన్ని రెస్ట్రక్షన్స్ ఉంటాయి. అది కూడా గవర్నర్ తెలుసుకొని మాట్లాడాలి. రాజ్యాంగపరమైన విధానంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? ప్రతిపక్షాలకు పని పాట లేదు. పొద్దున లేస్తే సోషల్ మీడియాలో ప్రచారం తప్ప వేరే లేదు.

_ తలసాని శ్రీనివాస్ యాదవ్

గవర్నర్లను ఎలా గౌరవించాలో ముఖ్యమంత్రికి, తమకు బాగా తెలుసని చెప్పిన మంత్రి.. గవర్నర్లు వారి పరిమితులకు లోబడి మాట్లాడాలన్నారు. రాజకీయ పార్టీల వ్యక్తుల వలె మాట్లాడటం మంచిది కాదని.. ఈ ముఖ్యమంత్రితో పనిచేయటం ఇష్టం లేదని అని చెప్పడమేంటని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. గవర్నర్‌ పరిధులు ఏంటో తెలుసుకుని వ్యవహరించాలన్నారు. ఆమె వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి: