Farm Laws Repealed: ఇది అన్నదాతలు సాధించిన విజయం.. తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలు

నూత‌న‌ సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా సాగిన ఉద్య‌మం ఫ‌లించిందని, ఇది అన్న‌దాత‌లు సాధించిన విజ‌యంగా తెలంగాణ అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అభివ‌ర్ణించారు.

Farm Laws Repealed: ఇది అన్నదాతలు సాధించిన విజయం.. తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలు
Indrakaran Reddy

Updated on: Nov 19, 2021 | 11:09 AM

నూత‌న‌ సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా సాగిన ఉద్య‌మం ఫ‌లించిందని, ఇది అన్న‌దాత‌లు సాధించిన విజ‌యంగా తెలంగాణ అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అభివ‌ర్ణించారు. ప్ర‌జాస్వామ్య ప‌ద్ధతిలో రైతులు చేసిన సుధీర్ఘ‌ పోరాటానికి కేంద్ర దిగిరాక త‌ప్ప‌లేద‌న్నారు. రైతుల‌కు మ‌ద్ధ‌తుగా… వ్య‌వ‌సాయ చ‌ట్టాలకు వ్య‌తిరేఖంగా సీయం కేసీఆర్ చేప‌ట్టిన ఉద్య‌మ‌ సెగ ఢిల్లీకి త‌గిలింద‌ని తెలిపారు. సీయం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అన్న‌దాత‌లకు అండ‌గా ఉంటుంద‌ని, వారి కోసం నిరంత‌ర పోరాటం కొన‌సాగిస్తుంద‌ని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నిర్విరామంగా పోరాటం చేసి విజయం సాధించిన అన్నదాతలకు ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందనలు తెలిపారు.

Also Read..

Farm Laws: అసలు 3 వ్యవసాయ చట్టాల్లో ఉన్న అంశాలేంటి..?.. పూర్తి వివరాలు మీ కోసం

అయినా రైతుల ఆందోళనలు ఆగవు.. అప్పటి వరకు కొనసాగిస్తాం: రాకేష్ తికాయత్ ప్రకటన