Munugodu: ‘మునుగోడు ఎన్నిక బీజేపీ కుట్ర.. కేసీఆర్ దృష్టి మరల్చేందుకే ఈ ప్రయత్నం’.. హరీశ్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

Oct 23, 2022 | 2:37 PM

రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే మాట. ఈ విషయంపైనే చర్చ. అదే మునుగోడు ఉప ఎన్నికలు. ఈ ఎలక్షన్ ను అధికార, ప్రతిపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలో..

Munugodu: మునుగోడు ఎన్నిక బీజేపీ కుట్ర.. కేసీఆర్ దృష్టి మరల్చేందుకే ఈ ప్రయత్నం.. హరీశ్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Minister Harish Rao
Follow us on

రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే మాట. ఈ విషయంపైనే చర్చ. అదే మునుగోడు ఉప ఎన్నికలు. ఈ ఎలక్షన్ ను అధికార, ప్రతిపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు విమర్శలూ చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఅర్ఎస్ కు భయపడి బీజేపీ మునుగోడు ఎన్నికల కుట్ర పన్నిందని వ్యాఖ్యానించారు. జాతీయ పోరాటానికి సిద్ధమైన కేసీఆర్ దృష్టి మరల్చేందుకు ఈ ప్రయత్నం చేశారని ఆక్షేపించారు. వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చి తెచ్చిన ఉప ఎన్నిక ఇది అన్న మంత్రి.. ప్రజల కోసం కాదని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి జరిగే ఎన్నిక ఇది హరీశ్ రావు అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు. హయత్ నగర్ లో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ ఎల్ఐసీ ఏజెంట్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ కామెంట్స్ చేశారు.

టైమ్‌ దగ్గరపడుతోంది. సమయం ముంచుకొస్తోంది. ఎన్నికల టైమ్‌తో పాటే పోటీపడి నడుస్తున్నారు నేతలు. మునుగోడులో గెలిచి తీరాలన్న కసితో మంత్రి కేటీఆర్ ముందుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో సమన్వయం చేస్తూనే స్వయంగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ సైతం ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది. అగ్రనేతలు మునుగోడులో విస్తృత ప్రచారం చేపడుతున్నారు. మునుగోడులో గెలిచి సాధారణ ఎన్నికల్లో సత్తా చాటాలన్న పట్టుదలతో కమలదళం ఉంది.

మరోవైపు.. ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. వలసలపై బీజేపీ-టీఆర్‌ఎస్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరుపార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటకు ఫుల్‌స్టాప్‌ పడడం లేదు. కీలక సందర్భంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. కోమటిరెడ్డి కామెంట్స్‌పై రియాక్టయిన మాణిక్కం ఠాగూర్‌.. ఈ వ్యవహారాన్ని ఏఐసీసీ చూసుకుంటుందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని మునుగోడు వార్తల కోసం..