Bank Timings: తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. బ్యాంక్‌ల పని వేళల్లో మార్పులు.. వివరాలివే..

Telangana Banks Timings: కరోనా వైరస్ మహమ్మారి బ్యాంకింగ్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీస్తోంది. తెలంగాణలో కరోనా లాక్‌డౌన్‌..

Bank Timings: తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. బ్యాంక్‌ల పని వేళల్లో మార్పులు.. వివరాలివే..
Banks ...

Updated on: May 13, 2021 | 11:24 AM

Telangana Banks Timings: కరోనా వైరస్ మహమ్మారి బ్యాంకింగ్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీస్తోంది. తెలంగాణలో కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో నేటి నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పులు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. కేవలం 50 శాతం సిబ్బంది మాత్రమే విధులకు హాజరు కానున్నారు.

కస్టమర్లు అత్యవసరమైతేనే బ్యాంకు రావాలని సూచించారు. కాగా, కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా బ్యాంకర్లు తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ నెల 20 వరకు బ్యాంకులు 4 గంటలు మాత్రమే పని చేయనున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ నెల 18వ తేదీ వరకు బ్యాంకులు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పని చేయనున్నాయి.

ఇక కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ మొదటి రోజు విజయవంతమైంది. లాక్‌డౌన్‌ నిబంధనలు మే 12 ఉదయం 10 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. ఉదయం ఆరు గంటలకే నిత్యావసర వస్తువుల దుకాణాలు, మార్కెట్లు తెరుచుకున్నాయి. దీంతో ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసరాలు, కూరగాయలు, పాలు తదితరాలు కొనుక్కొన్నారు. మద్యంప్రియుల కోసం వైన్‌షాపులను కూడా ఉదయం ఆరు గంటలకే తెరిచారు.

Also Read:

 షాకింగ్ యాక్సిడెంట్.. గాల్లో ఎగిరిన బైక్‌రైడర్‌.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..!

వాట్సాప్‏లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!

గగుర్పాటుకు గురిచేసే వీడియో.. పక్షి గూటిలోకి భారీ పైథాన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!

డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!