తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు జూలై 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు ఇవ్వగా.. ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ కీలక ప్రకటన చేశారు.
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా 70 శాతం సిలబస్ ఆధారంగా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిసింది. మరోవైపు జూలై 5 వరకు ఫస్టియర్ మొదటి విడత ప్రవేశాలు జరుగుతాయని అన్నారు. రెండు, మూడు విడతల్లో కూడా ఫస్టియర్ ప్రవేశాలను జరిపి.. ఆ తర్వాత వారికి దూరదర్శన్, టీశాట్ ద్వారా ఆన్‌లైన్ పాఠాలు ప్రసారం చేస్తామని చెప్పారు.
గత సంవత్సరం మాదిరిగానే 2021-22 విద్యా సంవత్సరానికి 70 శాతం సిలబస్ ఆధారంగా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు లేని విద్యార్ధుల కోసం కళాశాలల్లోనే డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేసేందుకు ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే 200 ప్రైవేట్ కళాశాలలకు అనుమతి ఇచ్చారట.
Also Read: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు జమ..