
ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులు అందరు పాస్ అయినట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు అందరిని కనీస మార్కులతో పాస్ చేస్తున్నట్లు వెల్లడించారు.
కరోనా విద్యారంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. దాన్ని అధిగమించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసిందని వివరించారు. డిజిటల్, టి షాట్ ద్వారా క్లాసులు నిర్వహించే ప్రయత్నం చేశామన్నారు. 9 పరీక్షలు రాయాల్సిన స్టూడెంట్స్‌ని 10thకి ప్రమోట్ చేశామని టెన్త్ వారిని ఇంటర్ ప్రమోట్ చేశామని.. ఇంటర్ సెకండ్ ఇయర్ వారిని కూడా ప్రమోట్ చేశామని గుర్తు చేశారు.
రాష్ట్రంలో 900పైగా గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. 620 గురుకులాలను ఇంటర్‌కు అప్‌గ్రేడ్ చేశామన్నారు. ఇంటర్ బోర్డు యూట్యూబ్ ఛానెల్‌ను 3 లక్షల పైగా పిల్లలు సబ్‌స్ర్కైబ్ చేసుకొని చూశారని సబితా తెలిపారు. సెకండ్ ఇయర్ వెళ్లే ముందు1st ఇయర్ విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టాలని నిర్ణయించమన్నారు. ఎన్నో ఆలోచించి నెల రోజుల టైం ఇచ్చి పరీక్షలు పెట్టామన్నారు. ఈ పరీక్షల్లో 49 శాతం మంది పాస్ అయ్యారని చెప్పారు.
ఫెయిల్ అయిన వాళ్లందరూ వచ్చి బోర్డు, ప్రభుత్వం ఎదో తప్పు చేసినట్లు మాట్లాడటం బాధాకరమని సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. ఇంటర్ బోర్డు ఎక్కడ మిస్టేక్ చేయలేదని స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు కూడా పిల్లల కెరీర్ విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. పిల్లలు బాగా చదువుకోవడానికి మోటివేట్ చేయాలన్నారు. 10 మార్కులు కలిపితే 8,070 మంది ఉత్తీర్ణులవుతారని 25 మార్కులు కలిపితే 70 వేల మంది పాసవుతారని పేర్కొన్నారు. ఈ ఫలితాల ప్రభావం సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‌పై పడొద్దని ఈ నిర్ణయం తీసుకున్నాట్లు సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో ఇలా చేయడం కుదరదని.. అందరు కష్టపడి చదవాలని కోరారు.
Read Also.. AP-Telangana: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సినిమా టికెట్ల కొత్త రేట్లు ఇవే.. పూర్తి వివరాలు మీ కోసం