Telangana: ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్న పత్రాలు లేక చేతితో రాసినవి ఇచ్చారు

|

May 12, 2022 | 8:20 AM

తెలంగాణ(Telangana) లో ఇంటర్ పరీక్షల నిర్వహణ పూర్తి నిర్లక్ష్యంగా కొనసాగుతోంది. పరీక్షల నిర్వహణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎగ్జామ్స్ ప్రారంభమైన రోజు నుంచి...

Telangana: ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్న పత్రాలు లేక చేతితో రాసినవి ఇచ్చారు
exams in telangana
Follow us on

తెలంగాణ(Telangana) లో ఇంటర్ పరీక్షల నిర్వహణ పూర్తి నిర్లక్ష్యంగా కొనసాగుతోంది. పరీక్షల నిర్వహణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎగ్జామ్స్ ప్రారంభమైన రోజు నుంచి ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. తాజాగా హిందీ మీడియం(Hindi Medium) విద్యార్థులకు బుధవారం ఫస్ట్ ఇయర్ పొలిటికల్‌ సైన్స్‌ పరీక్ష నిర్వహించారు. అయితే ఈ పరీక్షకు బోర్డు ద్వారా ప్రింట్ అయిన ప్రశ్నపత్రాలు ఇవ్వకుండా.. చేతితో రాసిన క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం గమనార్హం. హైదరాబాద్‌, నిజామాబాద్(Nizamabad) లలో విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఫస్ట్ ఇయర్ కు 32 మంది, సెకండ్ ఇయర్ కు 24 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఉదయం 8.30 గంటలకు క్వశ్చన్ పేపర్స్ బండిల్‌ను అధికారులు తెరిచారు. హిందీ మీడియం పేపర్లు లేకపోవడంతో ఇంగ్లీష్ మీడియం పేపర్లను ట్రాన్స్ లేటర్ తో హిందీలో రాయించారు. దాన్ని జీరాక్స్ తీయించి, విద్యార్థులకు ఇచ్చారు. అయితే విద్యార్థులకు చేతిరాత సరిగా అర్థం కాకపోవడంతో సమయం వృథా అవుతోందని విద్యార్థులు ఆవేదన చెందారు. ఇలా చేతితో రాసి ఇస్తామని ఆయా ప్రిన్సిపాళ్లకు గత మార్చిలోనే సమాచారం ఇచ్చామని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఆప్షనల్‌ సబ్జెక్టుల పేపర్లనూ ఇలానే ఇస్తామని తెలిపారు.

Question Paper

ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 6 నుంచి మొదలయ్యాయి. తొలిరోజు ప్రథమ సంవత్సరం సంస్కృతంలో రెండు ప్రశ్నలు రిపీటై విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. మరుసటిరోజు జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో రెండో ఏడాది సంస్కృతం బదులు హిందీ పేపర్‌ ఇచ్చారు. మరొకరికి హిందీకి బదులు సంస్కృతం ప్రశ్నపత్రం ఇచ్చారు. ఇక ప్రశ్న పత్రాల్లో తప్పులు నిత్యకృత్యమయ్యాయి. రోజూ ఇంటర్‌బోర్డు నుంచి ప్రశ్నలు సరి చేసుకోవాలని తప్పుల సవరణను పంపిస్తూనే ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి

Cyclone Asani Live Updates: ఏపీలో ఇంకా తగ్గని అసని ప్రభావం.. ఆ ప్రాంతాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్..

Axis Bank: పొదువు ఖాతాలపై వడ్డీ రేట్లు పెంచిన యాక్సిస్ బ్యాంక్.. ఎంత పెరిగాయంటే..