గడ్డిఅన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌ కూల్చివేతల తీరు దురదృష్టకరం.. కోర్టు ధిక్కరణపై హైకోర్టు ఆగ్రహం

|

Mar 08, 2022 | 10:11 PM

గడ్డిఅన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌లో కూల్చివేతలపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కూల్చివేతలు వెంటనే ఆపాలని ఆదేశించింది. అసలేం జరిగిందో చూద్దాం..

గడ్డిఅన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌ కూల్చివేతల తీరు దురదృష్టకరం.. కోర్టు ధిక్కరణపై హైకోర్టు ఆగ్రహం
Follow us on

గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌లో(gaddiannaram fruit market ) కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు(telangana high court). కూల్చివేతల తీరు దురదృష్టకరమని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ ధర్మాసనం వ్యాఖ్యానించింది. వ్యాపారులు తమ వస్తువులను బాటసింగారం తరలించేందుకు వీలుగా నెల పాటు మార్కెట్‌ తెరవాలని గత నెల 8న హైకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలను అమలు చేయడం లేదని ఉన్నత న్యాయస్థానం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయడంతో .. ఈనెల 4న హడావుడిగా మార్కెట్‌ తెరిచారు. గత నెల 8న ఆదేశించినప్పటికీ ఈనెల 4 వరకు మార్కెట్‌లోకి అనుమతించకపోవడంతో పండ్ల వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు మరోసారి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ధిక్కరణకు పాల్పడటంతో పాటు షెడ్లు, భవనాలు కూల్చివేస్తున్నారని వ్యాపారుల తరఫు న్యాయవాది గంగయ్య నాయుడు హైకోర్టుకు తెలిపారు.

పోలీసు బలగాలను భారీగా మోహరించి మార్కెట్‌ కూలుస్తున్నారని కోర్టుకు వివరించారు. గడ్డి అన్నారం మార్కెట్‌లోని 106 మంది కమీషన్‌ ఏజెంట్లలో 76 మంది ఖాళీ చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణను ఈనెల 14కి వాయిదా వేసిన హైకోర్టు.. మార్కెటింగ్‌శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్‌ లక్ష్మీబాయి హాజరుకావాలని ఆదేశించింది.

ఫ్రూట్‌ మార్కెట్‌ను త్వరగా ఖాళీ చేసి..సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. ఫ్రూట్‌ మార్కెట్‌ కమీషన్‌ ఏజెంట్లు హైకోర్టును ఆశ్రయించడం వల్ల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి: Russia Ukraine War: ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులకు ఊరట.. సుమీ నుంచి తరలింపు ప్రారంభం..