Mouse Glue Pads: ఎలుకలను పట్టేందుకు ఉపయోగించే గ్లూ ట్రాప్‌లపై నిషేధం విధించిన తెలంగాణ ప్రభుత్వం.. కారణమేంటో తెలుసా.?

|

Aug 21, 2021 | 4:41 PM

Mouse Glue Pad Banned: ఇంట్లో విపరీతమైన ఎలుకలు తిరుగుతుంటే ఏం చేస్తాం.? బోను లేదా ఎలుకల మందులను ఉపయోగిస్తాం. అయితే ఇటీవల వీటి స్థానంలో జిగురుతో ఉండే ప్యాడ్స్‌ (గ్లూట్రాప్‌) వినియోగం..

Mouse Glue Pads: ఎలుకలను పట్టేందుకు ఉపయోగించే గ్లూ ట్రాప్‌లపై నిషేధం విధించిన తెలంగాణ ప్రభుత్వం.. కారణమేంటో తెలుసా.?
Mouse Pads
Follow us on

Mouse Glue Pad Banned: ఇంట్లో విపరీతమైన ఎలుకలు తిరుగుతుంటే ఏం చేస్తాం.? బోను లేదా ఎలుకల మందులను ఉపయోగిస్తాం. అయితే ఇటీవల వీటి స్థానంలో జిగురుతో ఉండే ప్యాడ్స్‌ (గ్లూట్రాప్‌) వినియోగం బాగా పెరిగింది. వినియోగం సులభంగా ఉండడంతో వీటి అమ్మాకాలు భారీగా పెరిగాయి. అయితే వీటి వినియోగం వల్ల మూగ జీవాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ‘పీపుల్‌ ఫర్‌ ది ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనిమల్స్‌’ (పెటా) తెలంగాణ ప్రభుత్వానికి ఇటీవల విజ్ఞప్తి చేసింది. దీంతో ఈ విషయంపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ఈ గ్లూట్రాప్‌ల వినియోగాన్ని నిషేదించింది.

గ్లూట్రాప్స్‌తో ఎలుకలను బంధించడం అత్యంత క్రూరమైన విధానమని, ఎలుకలు వాటికి అతుక్కుపోయి తీవ్రనొప్పి, బాధను ఎదుర్కొంటాయని.. గ్లూట్రాప్‌ల వినియోగం జంతువులపై క్రూరత్వం నిషేధ చట్టం– 1960లోని సెక్షన్‌ 11 స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్థకశాఖ ప్రత్యేక సర్క్యులర్‌ జారీ చేసింది. నిషేధాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇలాంటి గ్లూ ప్యాడ్స్‌లో ఎలుకలతో పాటు ఇతర జంతువులు కూడా ఇరుక్కుపోయి చాలా కాలం పాటు ఆకలి, నీరు అందక చనిపోతున్నాయని. మరికొన్ని చిన్న ప్రాణులు ఈ గ్లోలో ఇరుక్కుపోయి.. తప్పించుకోవడానికి వాటి శరీర భాగాలను అవే కొరుక్కుంటూ చనిపోతున్నాయని’ పెటా ఇండియా ఆరోపించింది. ఎలుకల బెడదను తప్పించుకోవడానికి వాటిని ట్రాప్‌ చేసి డబ్బాలో పడేట్లు చేయొచ్చు.

ఇతర సంప్రదాయ పద్ధతుల్లో ఎలుకల నియంత్రణకు చర్యలు తీసుకోవచ్చని పెటా ఇండియా ప్రజలకు సూచించింది. ఇక గ్లూట్రాప్‌లను నిషేధిస్తూ ప్రభుత్వం ప్రకటించడంపై ‘పెటా’ హర్షం వ్యక్తం చేసింది.

Also Read: Paritala Siddharth: పరిటాల సిద్ధార్థ్ వద్ద బుల్లెట్ కలకలం.. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని పోలీసుల డెడ్‌లైన్‌..

Dmart Fake LInk: డీమార్ట్‌ పేరిట ఉచిత బహుమతులు అంటూ లింక్‌లు వస్తున్నాయా.? క్లిక్‌ చేశారో ఇక మీ పని అంతే..

Afghanistan Cricket: పాకిస్తాన్‌లో పుట్టి..భారత్‌లో పెరిగిన ఆఫ్ఘన్ క్రికెట్ తాలిబన్ చేతిలో ఏమవుతుంది?