ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు ఫీజులివే.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స, టెస్టులకు ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 401ని తాజాగా..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స, టెస్టులకు ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 401ని తాజాగా వైద్యారోగ్య శాఖ జారీ చేసింది. సాధారణ వార్డులో ఐసోలేషన్, కరోనా పరీక్షలకు రోజుకు రూ. 4 వేలు తీసుకోవాలని సూచించింది. అలాగే ఐసీయూ గదిలో రోజుకు రూ. 7,500గా నిర్ణయించింది. ఇక వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు రూ. 9 వేలు వసూలు చేయాలని సూచించింది. కాగా, కరోనా టెస్టులకు సంబంధించిన రేట్లు ఈ విధంగా ఉన్నాయి..
- పీపీఈ కిట్ – రూ. 273
- హెచ్ఆర్ సీటీ- రూ. 1995
- డిజిటల్ ఎక్స్‌రే- రూ. 1300
- ఐఎల్6- రూ. 1300
- డీడైమర్- రూ. 300
- సీఆర్‌పీ- రూ. 500
- ప్రొకాల్ సీతోసిన్- రూ. 1400
- ఫెరిటీన్- రూ. 400
- ఎల్‌డీహెచ్- రూ. 140
ఇదిలా ఉంటే సాధారణ అంబులెన్స్‌కు కిలోమీటరుకు రూ. 75గా.. కనీస ఛార్జీ రూ. 2 వేలు మించరాదు. అటు వసతులతో కూడిన అంబులెన్స్‌కు కిలోమీటరుకు రూ.125, మినిమం ఛార్జ్ రూ. 3 వేలుగా నిర్ణయించింది.
Also Read:
13 పరుగులకే ఆలౌట్.. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్.. ఆరు వికెట్లతో రఫ్ఫాడించిన ఆ బౌలర్ ఎవరంటే!
పండ్ల వ్యాపారి మోసం.. కస్టమర్లను ఎలా బురిడీ కొట్టిస్తున్నాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!