హైదరాబాదులో మరోసారి పోలీసు కాల్పుల కలకలం రేపింది. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆ వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంచేయడంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వ్యక్తికి గాయాలు అయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు స్నాచింగ్ ముఠాపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో దొంగలు కత్తులు, గొడ్డళ్లతో పోలీసులపై ఎదురుదాడికి దిగారు. ఈ ఘటన గురువారం అర్థరాత్రి 1.15 గంటలకు నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర చోటు చేసుకుంది. అయితే నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ డికాయిటీ టీమ్ ప్రయత్నిచింది. పోలీసులపై దొంగలు ఎదురు దాడికి దిగడంతో గాల్లో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: నీతా అంబానీ ధరించిన కుర్తా-షల్వార్ హైదరాబాద్‌లో తయారు చేసిందే.. స్పెషల్ ఏమిటంటే..
ఇదిలా ఉండగా, చైన్ స్నాచర్ల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒక వైపు దొంగల ముఠాలు ఇళ్లల్లో చొరబడి దొచుకుంటుంటే.. మరో వైపు ఈ చైన్ స్నాచర్లు పెరిగిపోతున్నారు. వారిని అరికట్టేందుకు పోలీసులు అనునిత్యం ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగా నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఈ దొంగలను పట్టుకునే ప్రయత్నిం చేశారు పోలీసులు. దీంతో వారు పోలీసులపైనే కత్తులు, గొడ్డళ్లతో ఎదురు దాడికి దిగేందుకు ప్రయత్నించగా, పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ఏడాదికి రూ.436 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా.. అదిరిపోయే స్కీమ్!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి