Hyderabad: పార్కింగ్‌ చేసిన ఎలక్ట్రిక్‌ బైక్‌లో మంటలు.. క్షణాల్లోనే దగ్ధమైన వైనం..

|

May 12, 2022 | 12:07 AM

Electric bike blast: మంగళవారం రాత్రి ఎల్బీనగర్‌లో ఓ ఎలక్ట్రిక్‌ బైక్‌ మంటల్లో కాలిపోయింది. పార్కింగ్ చేసిన బైక్‌లో హఠాత్తుగా మంటలు రావడం, క్షణాల్లోనే బైక్‌ దగ్ధం కావడంతో చుట్టు పక్కల ప్రజలు ఏం జరిగిందో తెలియక ఆందోళన పడ్డారు.

Hyderabad: పార్కింగ్‌ చేసిన ఎలక్ట్రిక్‌ బైక్‌లో మంటలు.. క్షణాల్లోనే దగ్ధమైన వైనం..
Electric Bike Blast
Follow us on

Electric bike blast: ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బైక్ లు, వాటి బ్యాటరీలు ఎక్కువగా పేలిపోతున్నాయి. ఈ ఘటనల్లో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృత్యువాత పడగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. కరీంనగర్‌లోనూ ఛార్జింగ్ పెట్టిన ఎలక్ర్టిక్‌ బైక్‌ బ్యాటరీ పేలిపోయింది. తాజాగా హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే ఒకటి చోటుకుంది. మంగళవారం రాత్రి ఎల్బీనగర్‌లో ఓ ఎలక్ట్రిక్‌ బైక్‌ మంటల్లో కాలిపోయింది. పార్కింగ్ చేసిన బైక్‌లో హఠాత్తుగా మంటలు రావడం, క్షణాల్లోనే బైక్‌ దగ్ధం కావడంతో చుట్టు పక్కల ప్రజలు ఏం జరిగిందో తెలియక ఆందోళన పడ్డారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.