
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించిన ఎన్నిల షెడ్యూల్‌ను సోమవారం ఎన్నికల సంఘం విడుదల చేసింది.ఈ ఎన్నికక కోసం నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 22న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది.ఇక ఈ ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా నవంబర్ 14వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీ నాథ్ మృతితో ఆ సీటు ఖాళీ అయింది. ఇప్పుడు ఈ సీటు కోసం మూడు ప్రధాన పార్టీలు పోటీని తీవ్రతరం చేశాయి. బీఆర్‌ఎస్ సానుభూతితో ఆలోచించి ఓట్లు వేయమని అడుగుతుంటే.. కాంగ్రెస్ మాత్రం అధికారంలో ఉన్నాం కాబట్టి అభివృద్ధి కోసం ఓటువేయాలంటోంది. బీజేపీ కూడా ఈరోజో రేపో అభ్యర్థిని ప్రకటించే ఆలోచనలో ఉంది.
మరోవైపు MIM అధినేత అసద్ దీనిపై స్పందించారు. ఈ ఉప ఎన్నిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే రేవంత్ తనకు మంచి సంబంధాలు ఉన్నాయనీ, అంతమాత్రాన, సైద్ధాంతికంగా తాము రాజీపడలేదన్నారు అసద్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.