తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ నిరుద్యోగులకు, యువతకు చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం 24 గంటల నిరాహారదీక్ష ప్రారంభించారు. సిటీ నడిబొడ్డున ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద ప్రారంభమైన నిరాహారదీక్షకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. నిరుద్యోగులు, యువకుల సమస్యలపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నBRS ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్‌తో పాటు పలువురు రాష్ట్ర నాయకులు ఈ దీక్షలో పాల్గొన్నారు.
గత 9 సంవత్సరాల కాలంలో BRS ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని, నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని కూడా తుంగలో తొక్కిందని కిషన్‌రెడ్డి ఫైరయ్యారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనే నినాదంతో అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్.. నిరుద్యోగులను నిండా ముంచేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన స్టూడెంట్స్‌కు, నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ అన్యాయం చేసిందన్నారు. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. తమ రాష్ట్రంలోనే ఉద్యోగాలు వస్తాయని కలలు కన్న యువతను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. BJP అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఎగ్జామ్ పేపర్ల లీక్‌పై.. BRS ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కేసీఆర్ ప్రభుత్వానికి లేదని.. ఈ విషయాన్ని నిరుద్యోగులు చెబుతున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో అధికార పార్టీ లీడర్స్ కమీషన్లు తీసుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కొందరు నాయకులు తమ వాటా పొందిన తర్వాతే రాష్ట్రంలోకి.. కంపెనీలను అనుమతిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఫండ్స్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ బలోపేతం చేస్తున్నారని ఆరోపించారు. BRS ప్రభుత్వ అవినీతి, దొరల పాలనపై పోరాటం కొనసాగుతుందన్నారు. BRSను గద్దె దింపేవరకు విశ్రమించేది లేదన్నారు. కేసీఆర్ దుష్ట పాలనపై అన్ని వర్గాల జనం అసంతృప్తితో ఉన్నారని చుగ్ చెప్పుకొచ్చారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో BRS అధికారాన్ని కోల్పోతుందని ఆయన పేర్కొన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో 100 శాతం లక్ష్యం సాధించామని మినిస్టర్ కేటీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ అంశంపై చర్చకు రావాలని BRS ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామన్న కేసీఆర్ ప్రకటన ఏమైందని తరుణ్ చుగ్ ప్రశ్నించారు. తెలంగాణలో దళిత బందు అమలు కేవలం బై ఎలక్షన్ జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితమైందన్నారు.
The fight against the corrupt and dynastic rule of BRS continues..
The 24-hour hunger strike against the incompetent, inefficient and inept BRS govt which failed to provide employment and support to the youth as promised during Telangana movement, begins at Dharna Chowk, Indira… pic.twitter.com/TTCqyAM62X
— G Kishan Reddy (@kishanreddybjp) September 13, 2023
మరిన్నీ తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..