హైదరాబాద్, ఆగస్టు31: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ‘గణేష్‌పురి’గా మార్చాలని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్ ప్రతిపాదించారు. గణేష్ చతుర్థి సందర్భంగా నియోజకవర్గంలో ప్రతి ఏటా భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ సమావేశంలో నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇందులో మహా గణపతి ఏర్పాటుతోపాటు 11 రోజుల పాటు నిర్వహాణ, నిమజ్జనంపై ఇందులో చర్చిస్తారు. అయితే ఈ ఏడాది గణేష్ చతుర్ధికి ముందు అంటే బుధవారం ఏర్పాట చేసిన సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పేరును గణేష్‌పురి అసెంబ్లీ నియోజకవర్గంగా మార్చాలనే ప్రతిపాదనను భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ తీసుకుంది. వారి నిర్ణయానికి తాను పూర్థిస్థాయలో అండగా నిలుస్తున్నాని అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్. మన ప్రాంతాలు మన సంప్రదాయాలకు అనుకూలంగా ఉండాలని.. ప్రతిధ్వనించనివ్వండన్నాని ఆయన అన్నారు.
గతంలో హైదరాబాద్, నిజామాబాద్ పేర్లను కూడా మారుస్తామని బీజేపీ సీనియర్ నేతలు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు మందు బీజేపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
చరిత్ర ప్రకారం, ఖైరతాబాద్ పేరు ఖైరతీ బేగం పేరుతో ఏర్పండింది. ఇబ్రహీం కుతుబ్ షా తన కూతురు ఖైరున్నీసా బేగానికి ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్‌గా మారింది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా (1550-1580) కుమార్తె ఖైరతీ బేగం. ఆమె పేరుతోనే ఈ ప్రాంతానికి ఆ పేరు పెట్టారు. హుస్సేన్ షా వలీ భార్య. ఖైరతాబాద్ మసీదు పక్కనే ఉన్న ఆమె సమాధి స్మారక చిహ్నం ఉంది. ఈ సమాధి 2002లో చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ రచించిన వైట్ మొఘల్స్ పుస్తకంలో పేర్కొన్న జేమ్స్ అకిలెస్ కిర్క్‌పాట్రిక్ భార్య ఖైర్-అన్-నిస్సా కావచ్చని పేర్కొన్నారు.
అలాగే, ఈ ప్రాంతంలోని ఖైరతాబాద్ మసీదు కుతుబ్ షాహీ శకం శిల్పకళకు అపూర్వమైనది, ఆరవ కుతుబ్ షాహీ రాజు సుల్తాన్ ముహమ్మద్ కుతుబ్ షా (1612-1626)కుమార్తె ఖైరతున్నీసా బేగం పేరు పెట్టబడింది.
Participated in the Bhagyanagar Utsav Committee Meeting in #Khairtabad Constituency, as we approach the #Ganesh Festival. I stand firmly behind the proposal to rename it as ‘Ganeshpuri Assembly Constituency’.
Let our regions resonate with the essence of our traditions pic.twitter.com/AWB5xPUdAw
— Natcharaju Venkata Subhash (@nvsubhash4bjp) August 30, 2023
బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో సింగరి శంకరయ్య 1954లో ఖైరతాబాద్‌లోని ఒక ఆలయంలో 1 అడుగు (0.30 మీ) గణేష్ విగ్రహాన్ని మొదటిసారిగా స్థాపించారు. ఈ విగ్రహం ఎత్తు ప్రతి ఏడాది పెరుగుతూ పెరుగుతూ వచ్చింది. అక్కడ అది 60 అడుగుల (18 మీ)కి చేరుకుంది. హుస్సేన్ సాగర్ సరస్సుకు దారి, పరిమితులు, పర్యావరణ సమస్యల కారణంగా పరిమాణం తరువాత తగ్గించబడింది. 2019లో విగ్రహం శిఖరం ఎత్తు 61 అడుగుల (19 మీ) తద్వారా ఆ సంవత్సరంలో భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహంగా అవతరించింది.
గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఖైరతాబాదు వినాయకుడు ఎత్తైన వినాయకుడిగా పేరుగాంచాడు. పండుగ రోజుకు మూడు నెలల ముందుగానే మహా గణపతి విగ్రహం పనులు మొదలవుతాయి. మహా గణపతి విగ్రహ నిర్మాణంలో శిల్పితోపాటు 200 కార్మికులు మూడు నెలల పాటు పగలు రాత్రి శ్రమిస్తారు.
ఖైరతాబాద్ గణేష్ దాని లడ్డూకు కూడా ప్రసిద్ధి చెందింది. దీనిని ప్రసాదంగా అందిస్తారు. 2009 వరకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ పండల్ వద్ద 50 కిలోల లడ్డూను ఉంచేవారు. 2010 నుంచి 2015 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న తాపేశ్వరంకు చెందిన స్వీట్ మేకర్ PVVS మల్లికార్జున్ రావు అకా మల్లి బాబు లడ్డూను అందించారు. ఇది తాపేశ్వరంలో తయారు చేయబడింది. ఖైరతాబాద్‌లోని విగ్రహ స్థానానికి ముందు ఇక్కడికి తీసుకొచ్చేవారు. రావు 2010లో 500 కిలోల బరువున్న లడ్డూను విరాళంగా అందించగా, అది క్రమంగా 2015లో 6000 కిలోలకు పెరిగింది. ఇది విగ్రహ చరిత్రలో అత్యంత బరువైన లడ్డూ.
2016లో ఉత్సవ్ కమిటీ భక్తులకు పెద్ద లడ్డూను పంపిణీ చేయడం సమస్యగా భావించి లడ్డూ బరువును 600 కిలోలకు తగ్గించాలని రావును కోరింది. ఆ తరువాత, ఖైరతాబాద్‌కు తాను ఇకపై లడ్డూను విరాళంగా ఇవ్వబోనని రావు ప్రకటించారు. కమిటీ ముందుగా అంగీకరించినట్లు చేతుల్లో లడ్డూను ఉంచకుండా గణేశుడి పాదాల వద్ద ఉంచడం ద్వారా తమ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. అదే సంవత్సరం రావు విశాఖపట్నంలోని గణేష్ విగ్రహానికి సమర్పించిన 29,465 కిలోల బరువున్న లడ్డూను సృష్టించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించారు .
ఖైరతాబాద్ మహాగణపతికి ఏటా నైవేద్యంగా తాపేశ్వరం నుంచి భారీ లడ్డూ ప్రసాదం వచ్చేది. కాని ఈసారి కరోనా కారణంగా ఈ భారీ లడ్డూను తయారు చేయించడం..దాన్ని తరలించడం పెద్ద ఇబ్బందికరంగా మారిన నేపధ్యంలో తాపేశ్వరం లడ్డూ ప్రసాదం స్వామివారి నైవేద్యానికి దూరమైంది.
ఖైరతాబాద్ నియోజకవర్గంను 1967లో ఐదు సెగ్మెంట్లతో కలుపుకుని దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. 2009 పునరవ్యవస్థీకరణతో శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కూకట్ పల్లిలు విడిపోయి అప్పటివరకు అంబర్ పేట నియోజకవర్గంలో ఉన్న హిమయత్ నగర్, అమీర్ పేటలను కలుపుకుని ఖైరతాబాద్ నియోజకవర్గంగా ఏర్పాటైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం