తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా..!
తెలంగాణ రాష్ట్ర శాసనసభ 15వ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్ తొలిసారిగా శాసనమండలి, శాసనసభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభ 15వ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్ తొలిసారిగా శాసనమండలి, శాసనసభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. శనివారం గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వం ప్రతిపాదించే ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లోనూ చర్చ జరగనుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2020-21ను ఆదివారం శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసనమండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రసంగాన్ని వినిపించనున్నారు. అసెంబ్లీని 12 రోజులు, మండలిని 5 రోజులు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. విపక్షాల చేసే ప్రతిపాదనలను బట్టి నిర్వాహణ రోజుల్లో మార్పులు ఉండే అవకాశముంది.
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”06/03/2020,12:23PM” class=”svt-cd-green” ] ముగిసిన గవర్నర్ ప్రసంగం. అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా [/svt-event]
[svt-event title=”గవర్నర్ ప్రసంగం” date=”06/03/2020,11:43AM” class=”svt-cd-green” ] ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం పూర్తి చేస్తున్నాం [/svt-event]
[svt-event title=”గవర్నర్ ప్రసంగం” date=”06/03/2020,11:42AM” class=”svt-cd-green” ] కోటి ఎకరాలకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా ప్రాజెక్ట్‌ల నిర్మాణం [/svt-event]
[svt-event title=”గవర్నర్ ప్రసంగం” date=”06/03/2020,11:40AM” class=”svt-cd-green” ] హోంగార్డులు, అంగన్‌వాడీల జీతాలను పెంచాం. [/svt-event][svt-event title=”గవర్నర్ ప్రసంగం” date=”06/03/2020,11:40AM” class=”svt-cd-green” ] ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60కి పెంచాం. [/svt-event]
[svt-event title=”గవర్నర్ ప్రసంగం” date=”06/03/2020,11:36AM” class=”svt-cd-green” ] రైతు ఆత్మహత్యలను నివారించాం.
[/svt-event][svt-event title=”గవర్నర్ ప్రసంగం” date=”06/03/2020,11:37AM” class=”svt-cd-green” ] వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం
[/svt-event][svt-event title=”గవర్నర్ ప్రసంగం” date=”06/03/2020,11:37AM” class=”svt-cd-green” ] చెరువులు, రిజర్వాయర్లపై మత్స్యకారులకు హక్కులు కల్పించాం.
[/svt-event][svt-event title=”గవర్నర్ ప్రసంగం” date=”06/03/2020,11:37AM” class=”svt-cd-green” ] నాయిూ బ్రహ్మణులను ఆర్థికంగా ఆదుకుంటున్నాం. [/svt-event]
[svt-event title=”గవర్నర్ ప్రసంగం” date=”06/03/2020,11:31AM” class=”svt-cd-green” ] కరెంటు, నీటి సమస్యను రాష్ట్రం అధిగమించింది. [/svt-event]
[svt-event title=”గవర్నర్ ప్రసంగం” date=”06/03/2020,11:30AM” class=”svt-cd-green” ] అన్ని రంగాల్లో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోంది. [/svt-event]
[svt-event title=”గవర్నర్ ప్రసంగం” date=”06/03/2020,11:26AM” class=”svt-cd-green” ] సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళుతోంది. [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”06/03/2020,11:25AM” class=”svt-cd-green” ] 60ఏళ్ల పోరాటం తరువాత తెలంగాణ ఏర్పడింది. ఉద్యమనేతనే సీఎంగా ఉన్నారు [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”06/03/2020,11:24AM” class=”svt-cd-green” ] ఉభయసభలను ఉద్దేశించి ప్రసగిస్తోన్న గవర్నర్ [/svt-event]