- Telugu News Photo Gallery Technology photos Amazon offering huge discount on panasonic 55 inch smart TV, Check here for full details
Panasonic: రూ. 43 వేలకే 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. ఏకంగా రూ. 20 వేలకిపైగా డిస్కౌంట్..
సమయంతో సంబంధం లేకుండా ఈ కామర్స్ సంస్థలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై మంచి సేల్ నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓ స్మార్ట్ టీవీపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఇంతకీ ఏంటా టీవీ.? అంతలా లభిస్తోన్న ఆఫర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Nov 08, 2024 | 11:47 PM

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ పానసోకిన్ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. పానాసోనిక్ 55 ఇంచెస్ టీవీపై అమెజాన్‌లో 29 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో పాటు పలు కార్డులపై అదనంగా డిస్కౌంట్ అందిస్తోంది.

పానసోనిక్ 55 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 62,990కాగా అమెజాన్‌లో 29 శాతం డిస్కౌంట్‌తో రూ. 44,990కి లభిస్తోంది. అయితే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1750 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇలా అన్ని ఆఫర్లు కలుపుకుంటే ఈ టీవీని సుమారు రూ. 43 వేలకే సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ టీవీలో 55 ఇంచెస్‌తో కూడిన ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఇచ్చారు. 60 హెచ్‌జెడ్ రిఫ్రెస్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. 4కే కలర్ ఇంజన్, వైడ్ వ్యూయింగ్, హెగ్జా క్రోమ్ వంటి ఫీచర్లు ఈ టీవీ సొంతం.

ఇక ఈ టీవీ డాల్బీ డిజిటల్‌కు సపోర్ట్ చేస్తుంది. బిల్ట్ ఇన్ హోమ్ థియేటర్ ఫీచర్‌ను ఇచ్చారు. అలాగే ఈ టీవీలో నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జీ5 వంటి ఇన్‌బిల్ట్ యాప్‌లను అందించారు.

ఈ టీవీపై ఏడాది వారంటీని అందించారు. 16 జీబీ స్టోరేజ్, 2 జీబీ ర్యామ్ ఈ టీవీ సొంతం. అలాగే ఈ టీవీ క్వాడ్ కోర్ ఏ55 ప్రాసెసర్‌ను ఇచ్చారు. బ్లూటూత్, వైఫ్‌తో పాటు ఇథర్ నెట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇచ్చారు.




