
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి చంపేస్తోంది.. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రతతో ప్రజలు గజ గజ వణికిపోపోతున్నారు. తెలంగాణలో దాదాపు అన్నిచోట్లా సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది.. వచ్చే 3 రోజులు భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతాయని, జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
రాయలసీమ:- గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
రాగల 5 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్ , యానములో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేదు. రాగల 5 రోజుల్లో రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండు చోట్ల సాధారణము కంటే 2-3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముంది.
గురువారం, శుక్రవారం, శనివారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3°C నుండి 4°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ మరియు మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు, రేపు చలిగాలులు వీచే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..