Rain Alert: కొనసాగుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే రెండు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Rain Alert: కొనసాగుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
Andhra Pradesh Telangana Weather Forecast

Updated on: Feb 24, 2026 | 3:57 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే రెండు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు అనగా ఫిబ్రవరి 24, 2026, ఉదయం 0830 గంటలకు అదే ప్రాంతంలో కొనసాగుతున్నది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. ఇది దాదాపు తూర్పు వైపు కదులుతూ రాబోయే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.

ఇంకా నిన్నటి ద్రోణి దక్షిణ అంతర కర్ణాటక నుండి మరాఠ్వాడ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ – యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, ఆగ్నేయం దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-

మంగళవారం తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

రాయలసీమ:-

మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.

గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

గమనిక :- రాగల 3 రోజుల్లో కోస్తాంద్ర – రాయలసీమలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు:

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్న దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుండి మరాత్వాడ వరకు ఏర్పడిన ద్రోణి సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఈరోజు కూడా కొనసాగుతోంది. నిన్న గ్యాంగ్టిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుండి తూర్పు కోస్తా ఆంధ్ర తీరం వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు బలహీన పడింది. తెలంగాణలో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

గురువారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us