తెలంగాణలో ఎగురుతోన్న పసుపు పచ్చ జెండాలు… ఆంధ్రాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయ్!. కాంగ్రెస్ ర్యాలీల్లో పసుపు ఫ్లాగ్స్ కనిపించడంపై హాట్ కామెంట్స్ చేసింది వైసీపీ. ఇంతకీ, ఆ పచ్చా జెండాలేంటి?. ఎందుకు కాంగ్రెస్ ర్యాలీల్లో కనిపిస్తున్నాయ్? వైసీపీ ఎందుకు రియాక్ట్ అయ్యింది? ఈ స్టోరీలో చూడండి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు… ఆంధ్రాలో కల్లోలం రేపుతున్నాయ్!. తెలంగాణ ఎలక్షన్స్‌లో పేలుతోన్న మాటల తూటాలకు దీటుగా ఏపీ పాలిటిక్స్‌లో డైలాగ్ వార్ జరుగుతోంది. దీనికి కారణం పసుపు జెండాలు. అవును, మీరు విన్నది నిజమే. తెలంగాణలో ఎగురుతోన్న పచ్చ జెండాలే… ఆంధ్రాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయ్!. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతుంటే… ఏపీలో పొలిటికల్ ఫైట్ మొదలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న తెలుగుదేశం… కాంగ్రెస్ ర్యాలీల్లో కనిపించడంపై చంద్రబాబును టార్గెట్ చేసింది వైసీపీ. ఇది బరితెగింపు కాదా అంటున్నారు విజయసాయిరెడ్డి. డ్రామాస్ పార్టీ ఎటువంటి అపవిత్రమైన పొత్తులకైనా తెగిస్తుందనడానికి ఇది మరో రుజువంటూ ట్వీట్ చేశారు.
ఏపీ ప్రభుత్వ సలహదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే తరహా కామెంట్స్ చేశారు. కనీసం మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించకుండా కాంగ్రెస్‌కు ఇంత బహిరంగంగా టీడీపీ ఎలా సపోర్ట్ చేస్తుందని ప్రశ్నించారు సజ్జల. ఏపీలోనేమో జనసేనతో పొత్తు… తెలంగాణలోనేమో కాంగ్రెస్‌తో కలిసి డ్రామా… ఇదెక్కడి రాజకీయం అంటోంది వైసీపీ. ఇలాంటి డ్రామాలు ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యమంటోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ ర్యాలీల్లో ఎగురుతోన్న తెలుగుదేశం జెండాలు… ఆంధ్రా రాజకీయాల్లో కల్లోలం రేపుతున్నాయ్. మరి, ఈ రచ్చ ఎటువైపు వెళ్తుందో!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..