T-seva Job Fair In Hyderabad: భారతసేవ సెంటర్‌కు చెందిన టీ-సేవ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా నియమకాలు కుంటుపడ్డ తరుణంలో నిరుద్యోగుల కోసం జాబ్ ఫెయిర్ నిర్వహించనుంది.
ఫిబ్రవరి 2న జరగనున్న ఈ వాక్ ఇన్ జాబ్ ఫెయిర్‌ను హైదరాబాద్‌లోని మణికొండలో ఉన్న టీ-సేవా కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్ ఫెయిర్‌కు హాజరుకావొచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు మణికొండలోని టీ-సేవాకార్యాలయంలో సప్రందించవచ్చు. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో సంబంధింత విద్యా అర్హత సర్టిఫికెట్లతో పాటు రెజ్యుమేను వెంటతెచ్చుకోవాలని తెలిపారు. మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైన్, సేల్స్, ఎడ్యుకేషన్ కౌన్నెలింగ్, బ్యాంక్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఆన్‌లైన్ సర్వీస్‌లతో పాటు ఇతర రంగాల్లో వివిధ టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టుల కోసం ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు 9505800047 నెంబర్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు. ఇక ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్క నిరుద్యోగి ఉపయోగించుకోవాలని సూచించారు.