4వ తరగతి చదువుతున్న చిన్నారిపై పెన్సిల్ అటాక్

| Edited By: Vijay K

Mar 29, 2019 | 7:34 PM

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ కృషి హైస్కూల్లో దారుణం జరిగింది. తోటి విద్యార్థి దాడిలో.. 4వ తరగతి చదువుతున్న సుప్రియ కంటికి తీవ్ర గాయమైంది. కంట్లో పెన్సిల్ గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఇంత జరిగినా స్కూల్ యాజమాన్యం తమకేం పట్టనట్లు వ్యవహరించింది. మీ పాపకు గాయమైంది.. వచ్చి తీసుకు వెళ్లండంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చేతులు దులుపుకుంది స్కూల్ యాజమాన్యం. తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకోగానే పాప ఏడుస్తూ కన్పించింది. కంటికి తీవ్ర గాయం కావడంతో వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి […]

4వ తరగతి చదువుతున్న చిన్నారిపై పెన్సిల్ అటాక్
Follow us on

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ కృషి హైస్కూల్లో దారుణం జరిగింది. తోటి విద్యార్థి దాడిలో.. 4వ తరగతి చదువుతున్న సుప్రియ కంటికి తీవ్ర గాయమైంది. కంట్లో పెన్సిల్ గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఇంత జరిగినా స్కూల్ యాజమాన్యం తమకేం పట్టనట్లు వ్యవహరించింది.

మీ పాపకు గాయమైంది.. వచ్చి తీసుకు వెళ్లండంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చేతులు దులుపుకుంది స్కూల్ యాజమాన్యం. తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకోగానే పాప ఏడుస్తూ కన్పించింది. కంటికి తీవ్ర గాయం కావడంతో వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

చిన్నారి కంటికి ఎక్స్ రే తీయగా.. లోపల పెన్సిల్ ముక్క ఉన్నట్లు గుర్తించారు డాక్టర్లు. దీంతో ఆపరేషన్ చేసి ఆ పెన్సిల్ ముక్క తొలగించారు. అయితే.. కంటి లోపల రక్తం గడ్డ కట్టడంతో.. పాప చూపు కోల్పోయే ప్రమాదముందని వైద్యులు హెచ్చరించారు. దీంతో.. స్కూల్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. తమకు న్యాయం చేయాలని స్కూల్ ముందు బైఠాయించి డిమాండ్ చేస్తున్నారు.