Trains Cancelled: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజులపాటు 10 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు ఇదిగో

తెలుగు రాష్ట్రాల మధ్య రైలులో ప్రయాణం చేసే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజుల పాటు.. 10 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అంతేకాకుండా పలు రైళ్లకు అంతరాయం కలగనుంది.. పాపటపల్లి - డోర్నకల్‌ బైపాస్‌ మధ్య మూడో రైల్వే లైను నిర్మాణ పనుల నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది.

Trains Cancelled: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజులపాటు 10 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు ఇదిగో
Train Cancelled

Updated on: Aug 13, 2025 | 3:42 PM

రైళ్ల ద్వారా తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణం చేసే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజుల పాటు.. 10 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అంతేకాకుండా పలు రైళ్లకు అంతరాయం కలగనుంది.. పాపటపల్లి – డోర్నకల్‌ బైపాస్‌ మధ్య మూడో రైల్వే లైను నిర్మాణ పనుల నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన విడుదల చేసింది. 10 రైళ్లు.. 14 నుంచి 18వ తేదీ వరకు ఐదు రోజులు పాటు రద్దుచేసినట్లు పేర్కొంది..

ఆగస్టు 14 నుంచి 18వ తేదీ వరకు రద్దయిన రైళ్లు ఇవే..

1. డోర్నకల్‌- విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 67767)

2. విజయవాడ- డోర్నకల్‌ (ట్రెయిన్ నెంబర్ 67768)

3. కాజీపేట- డోర్నకల్ (ట్రెయిన్ నెంబర్ 67765)

4. డోర్నకల్‌- కాజీపేట (ట్రెయిన్ నెంబర్ 67766)

5. విజయవాడ- సికింద్రాబాద్ (ట్రెయిన్ నెంబర్ 12713)

6. సికింద్రాబాద్‌- విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 12714)

7. విజయవాడ- భద్రాచలం రోడ్ (ట్రెయిన్ నెంబర్ 67215)

8. భద్రాచలం రోడ్‌- విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 67216)

9. గుంటూరు- సికింద్రాబాద్ (ట్రెయిన్ నెంబర్ 12705)

10. సికింద్రాబాద్‌- గుంటూరు (ట్రెయిన్ నెంబర్ 12706)

వీటితోపాటు.. మరో 26 రైళ్లలో కొన్నింటిని ఒక రోజు, మరికొన్నింటిని రెండు రోజుల పాటు రద్దు చేశారు..

దాదాపు తొమ్మిది రైళ్లను దారి మళ్లించనున్నారు. ఇంకో మూడు రైళ్లు ఆలస్యంగా బయల్దేరతాయని.. రెండు రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ఏమైనా సందేహాలుంటే.. సహాయం కోసం 139 డయల్ చేయాలని రైల్వే అధికారులు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..