Sankranthi Special Trains 2026: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. రేపట్నుంచే స్పెషల్ ట్రైన్స్ బుకింగ్స్‌ ప్రారంభం!

సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్లకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సహా కొన్ని రైళ్ల టైమింగ్స్‌లో మార్పులు..

Sankranthi Special Trains 2026: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. రేపట్నుంచే స్పెషల్ ట్రైన్స్ బుకింగ్స్‌ ప్రారంభం!
Sankranthi Special Trains

Edited By: Srilakshmi C

Updated on: Dec 13, 2025 | 8:56 PM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 13: సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్లకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సహా కొన్ని రైళ్ల టైమింగ్స్‌లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే ఇప్పటికే నడుస్తున్న కొన్ని వీక్లీ స్పెషల్ ట్రైన్లను సంక్రాంతి రద్దీ ముగిసే వరకు మరికొన్ని వారాల పాటు పొడిగిస్తున్నారు.

స్పెషల్ ట్రైన్ల వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ – అనకాపల్లి (07041): జనవరి 4, 11, 18, అనకాపల్లి – సికింద్రాబాద్ (07042): జనవరి 5, 12, 19, హైదరాబాద్ – గోరఖ్‌పూర్ (07075): జనవరి 9, 16, 23, గోరఖ్‌పూర్ – హైదరాబాద్ (07076): జనవరి 11, 18, 25 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్ ట్రావెల్స్‌, ఆర్టీసీ బస్సులతో పోలిస్తే రైలు టికెట్ ధరలు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు రైల్వే ప్రయాణానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

కాచిగూడ నుంచి రోజూ పదుల సంఖ్యలో రైళ్లు నడుస్తున్నా, ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాలు, పట్టణాలకు వెళ్లే రైళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, గుంటూరు, తెనాలి, రేపల్లె (డెల్టా ఎక్స్‌ప్రెస్).. కర్నూల్ మీదుగా వెళ్లే చెన్నై, చెంగల్పట్టు.. చిత్తూరు వెంకటాద్రి.. పుదుచ్చేరి.. బెంగళూరు – అశోకపురం, యశ్వంత్‌పూర్ రైళ్లలో పండుగకు ముందే రిజర్వేషన్లు పూర్తయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే అత్యాధునిక స్లీపింగ్ పాడ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం చర్లపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ఈ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. విమానాశ్రయాల తరహాలో రూపొందించిన ఈ స్లీపింగ్ పాడ్‌లలో లగేజీ లాకర్లు, మొబైల్ ఛార్జింగ్, ఉచిత వైఫై శుభ్రమైన టాయిలెట్ల వంటి సౌకర్యాలు ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ సేవలను వినియోగించుకునేందుకు గంటల ప్రాతిపదికన ఛార్జీలు వసూలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.