Indian Railways: పండుగ సీజన్‌లో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రయాణీకులు enquiry.indianrail.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి తెలుసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఆరు వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ప్రత్యేక రైలు (నెం.08579) విశాఖపట్నం నుంచి నవంబరు 3,10,17 తేదీల్లో సాయంత్రం 7 గం.లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గం.లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే మరో ప్రత్యేక రైలు (నెం.02576) సికింద్రాబాద్ నుంచి నవంబరు 4,11,18 తేదీల్లో రాత్రి 7.40 గం.లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06.40 గం.లకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
6 Special Trains between #Secunderabad and #Visakhapatnam @drmsecunderabad @drmhyb @DRMWaltairECoR pic.twitter.com/5ZpkInAleq
— South Central Railway (@SCRailwayIndia) October 29, 2021
అలాగే వివిధ మార్గాల్లో దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మరో ట్వీట్‌లో ప్రకటించింది.
#Diwali Special Trains between various destinations @drmhyb @drmsecunderabad @VijayawadaSCR pic.twitter.com/w30KAJqRSj
— South Central Railway (@SCRailwayIndia) October 29, 2021
Also Read..
Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..