Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనున్న ద.మ.రైల్వే

|

Nov 12, 2021 | 10:20 AM

Railway News: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్ల మీదుగా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇందులో భాగంగా గోరఖ్‌పూర్ - హైదరాబాద్ మధ్య సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైళ్లను ద.మ.రైల్వే నడపనుంది.

Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనున్న ద.మ.రైల్వే
Sankranti Special Train
Follow us on

South Central Railway: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్ల మీదుగా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇందులో భాగంగా గోరఖ్‌పూర్ – హైదరాబాద్ మధ్య సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైళ్లను ద.మ.రైల్వే నడపనుంది. దీనికి సంబంధించిన వివరాలను ద.మ.రైల్వే తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ప్రత్యేక రైలు నెం.0275 హైదరాబాద్ నుంచి ఇవాళ (నవంబరు 11) రాత్రి 09.05 (శుక్రవారం) గం.లకు బయలుదేరి ఆదివారం వేకువజామున 06.30 గం.లకు గోరఖ్‌పూర్ చేరుకుంటుంది.

ఎదురుదిశలో ప్రత్యేక రైలు నెం.02576 గోరఖ్‌పూర్ నుంచి ఈ నెల 14న ఉదయం 08.30 గం.లకు(ఆదివారం) బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 03.20 గం.లకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, సెకండ్ సిట్టింగ్ కోచ్‌లు ఉంటాయి. పూర్తి రిజర్వేషన్లతో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.

ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తిరుపతి – కదిరిదేవరపల్లికి మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రత్యేక రైలు నెం.07589 ఈ నెల 30న రాత్రి 11.05 గం.లకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 01 గం.కు కదిరిదేవరపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అలాగే ఎదురుదిశలో ప్రత్యేక రైలు నెం.07590 డిసెంబరు 1న మధ్యాహ్నం 03.15 గం.లకు బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 03.35 గం.లకు తిరుపతికి చేరుకుంటుంది.

అలాగే ఈ నెల 14 నుంచి ద.మ.రైల్వే తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్ల మధ్య మెము ప్రత్యేక రైళ్లను (అన్ రిజర్వ్) నడపనున్నాయి. వాటి వివరాలు..

రైల్వే శాఖ నడుపుతున్న ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రయాణీకులు enquiry.indianrail.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి తెలుసుకోవచ్చు. వీటిలో ప్రయాణించేందుకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. నేరుగా బుకింగ్ కేంద్రాలు లేదా IRCTC పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లను రిజర్వేషన్ చేసుకోవచ్చు.

Also Read..

Watch Video: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. అనంతరం పాక్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే? వీడియో మీకోసమే.!

Viral Video: భారీ కొండచిలువతో ఆటలు ఆడుతోన్న చిన్నారి.. భయం లేకుండా అల్లరి చేస్తోంది.. చూస్తే షాకవుతారు!